Breaking News
  • తెలంగాణ నీటిపారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు. జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించిన సీఎం. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం పెరిగింది. మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సిఇలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన పీఎం.
  • తెలంగాణకు మరో భారీ పెట్టుబడి: మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ 1200 కోట్ల పెట్టుబడి. ఇప్పుడున్న తన అర్ అండ్ డి సెంటర్ ను 1200 కోట్లతో విస్తరించనున్న మెడ్ ట్రానిక్స్. అమెరికా అవతల మెడ్ ట్రానిక్ అతిపెద్ద అర్ అండ్ డి సెంటర్ ఇదే ఈ పెట్టుబడికి తెలంగాణ అనకూలమన్న కంపెనీ చైర్మన్ ఒమర్ ఇస్రాక్ రెండేళ్లుగా నిరంతరం కంపెనీతో చర్చిస్తున్న తెలంగాణ రాష్ర్టం. ఈ పెట్టుబడితో భారతదేశ మెడ్ టెక్ హబ్ గా హైదరాబాద్ మారుతుందన్న మంత్రి కెటియార్.

  • కేరళ : కేరళ రాష్ట్రం లోని మున్నారు లో విరిగిపడ్డ కొండ చరియలు కారణం గా ఇప్పటివరకు 52 మంది మృతి ,20 మంది గల్లంతు . గల్లంతయిన వారిలో 20 మంది కోసం కొనసాగుతున్న రెస్క్యూ . మృతి చెందినవారిలో ఎక్కువశాతం తమిళనాడుకి చెందిన వారే.
  • రాజధాని వికేంద్రీకరణ మరియు సిఆర్డిఏ రద్దు బిల్లుల పై కోర్టు లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు బాధ్యతలు మునిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు కి అప్పగింత . అనేక డిపార్ట్మెంట్ లను ప్రతివాదులుగా చేరుస్తున్న నేపధ్యంలో కౌంటర్ అఫిడవిట్ కోసం శ్యామల రావును నామినేట్ చేసిన సర్కార్ . చీఫ్ సెక్రటరీ తో సహా మిగిలిన అధికారుల బదులు కౌంటర్ అఫిడవిట్ లో శ్యామల రావు సంతకం చేసేలా ఆదేశం. శ్యామల రావు అందుబాటులో లేని పక్షంలో మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ్ మనోహర్ రావు కు ఆ బాధ్యతలు . ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
  • కడప జిల్లా: మాజీ మంత్రి సీనియర్ నేత ఖలీల్ బాష కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీల్ బాష. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ మంత్రి.
  • ట్విట్టర్లో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో 2 వ స్థానంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఇవాళ ఒక్కరోజే 70 వేలా ట్వీట్లతో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఫలించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడేళ్ళ కృషి. సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై విశేష అవగాహన తీసుకొస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై నెటిజెన్ల ప్రశంసల ఝల్లు.

బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించడంతో 8 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఆదివారం ఘ‌జియాబాద్ లో బాణాసంచా కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
Eight persons dead and 20 injured in an explosion at a factory in modinagar, బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించడంతో 8 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఆదివారం ఘ‌జియాబాద్ లో బాణాసంచా కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

ఘ‌జియాబాద్ లోని మోదీ న‌గ‌ర్ త‌హ‌సీల్ ప‌రిధిలో బార్ఱ్వాన్ గ్రామంలోని బాణాసంచా క‌ర్మాగారంలో ఆదివారం మ‌ధ్యాహ్నం పేలుళ్లు సంభ‌వించాయి. పేలుళ్లు సంభ‌వించిన స‌మ‌యంలో ఫ్యాక్టరీలో మొత్తం 30 మంది కార్మికులు ప‌ని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పేలుళ్ల ధాటికి మంట‌లు ఎగిసిప‌డ‌టంతో.. కార్మికులు బ‌య‌ట‌కు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. అప్ప‌టికే మంట‌లు వ్యాపించ‌డంతో కొంద‌రు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారని పోలీసులు తెలిపారు. బాణసంచా పేలుళ్ల ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంట‌ల వ్యాప్తి నేప‌థ్యంలో ఆ చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి మృతదేహాలను వెలికితీశారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, గ‌త ఐదేళ్లుగా బాణాసంచా ఫ్యాక‌ర్టీని అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ అక్ర‌మ ఫ్యాక్ట‌రీపై అధికారుల‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్ట‌రీ నిర్వాహ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ఘటనలో గాయపడిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించాలని అధికారులను సూచించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి ఈ సాయంత్రం నాటికి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

Related Tags