అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మందికి గాయాలు.. పరారీలో షూటర్‌

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. విస్కాన్సిన్‌లోని ఓ మాల్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు

  • Manju Sandulo
  • Publish Date - 11:11 am, Sat, 21 November 20

America Mall Shooting : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. విస్కాన్సిన్‌లోని ఓ మాల్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. శ్వేతజాతి యువకుడు ఈ కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతుందని తెలిపారు. గాయపడ్డ వారిలో ఏడుగురు పెద్దలు, ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మాల్‌లోకి ఒక్కసారిగా వచ్చిన ఆ యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపగా.. ఆ సన్నివేశాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Read More:

కోహ్లీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందే.. విరాట్‌కి వీవీఎస్ లక్ష్మణ్ మద్దతు

‘కలర్‌ ఫొటో’ను వదలుకున్న నిహారిక.. చాందిని మొదటి ఆప్షన్ కాదట