ఆకతాయి కోసం యాత్రికులను నొప్పిస్తారా?

ఎప్పుడూ పర్యాటకులతో రద్దిగా ఉండే టవర్ వద్ద సోమవారం గందరగోళం వాతావరణం ఏర్పడింది. గుర్తు తెలియని వ్యక్తి అనుమతి లేకుండా టవర్‌పై ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు పర్యాటకులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగంతకుడు 324 మీటర్లు(దాదాపు 1.063 ఫీట్లు) పైకి ఎక్కినట్లు సమాచారం. టవర్‌లోని రెండో లెవల్ వరకూ అంటే దాదాపు గ్రౌండ్ లెవల్ నుంచి 149 […]

ఆకతాయి కోసం యాత్రికులను నొప్పిస్తారా?
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 6:14 PM

ఎప్పుడూ పర్యాటకులతో రద్దిగా ఉండే టవర్ వద్ద సోమవారం గందరగోళం వాతావరణం ఏర్పడింది. గుర్తు తెలియని వ్యక్తి అనుమతి లేకుండా టవర్‌పై ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు పర్యాటకులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగంతకుడు 324 మీటర్లు(దాదాపు 1.063 ఫీట్లు) పైకి ఎక్కినట్లు సమాచారం. టవర్‌లోని రెండో లెవల్ వరకూ అంటే దాదాపు గ్రౌండ్ లెవల్ నుంచి 149 మీటర్లు మాములుగా వెళ్లిన అతను అక్కడి నుంచి పైకి పాకడం మొదలు పెట్టాడు.

వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అక్కడ ఉన్న పర్యాటకులను అక్కడి నుంచి పంపించారు. ‘‘ఇక క్లయింబర్ మాకు కనిపించాడు. అతన్ని ఆపాలి.. అందుకోసమే మేం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించాము. పరిస్థితులు మెరుగుపడేంత వరకూ పర్యాటలకు తన సందర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నాము’’ అని ఓ అధికారి తెలిపారు.