వెరీ ‘గుడ్డు’

గుడ్డు ఓ పోషకాల గని. ప్రతిరోజూ ఓ గుడ్డు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న విషయం చైనాలో నిర్వహించిన ఓ పరిశోధన‌లో వెల్లడైంది. 30 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సున్న సుమారు వెయ్యిమంది మీద తొమ్మిది సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. వీరిలో సగం మందికి రోజుకో గుడ్డు చొప్పున ఇచ్చారు. మిగతా వారికి వారంలో రెండు మూడుసార్లు మాత్రమే ఇచ్చారు. తొమ్మిది సంవత్సరాల అనంతరం వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ప్రతిరోజూ గుడ్డు తిన్న వారిలో […]

వెరీ 'గుడ్డు'
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:32 PM

గుడ్డు ఓ పోషకాల గని. ప్రతిరోజూ ఓ గుడ్డు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న విషయం చైనాలో నిర్వహించిన ఓ పరిశోధన‌లో వెల్లడైంది. 30 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సున్న సుమారు వెయ్యిమంది మీద తొమ్మిది సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. వీరిలో సగం మందికి రోజుకో గుడ్డు చొప్పున ఇచ్చారు. మిగతా వారికి వారంలో రెండు మూడుసార్లు మాత్రమే ఇచ్చారు. తొమ్మిది సంవత్సరాల అనంతరం వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ప్రతిరోజూ గుడ్డు తిన్న వారిలో గుండెజబ్బులు 18 శాతం, హెమరేజ్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 26 శాతం తగ్గడాన్ని అధ్యయనకారులు గుర్తించారు.