లాక్‌డౌన్, అమెరికా వీసాలపై ఆంక్షలతో.. భారీగా తగ్గిన విద్యారుణాలు!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో విద్యా రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2019–20లో విద్యారుణం

లాక్‌డౌన్, అమెరికా వీసాలపై ఆంక్షలతో.. భారీగా తగ్గిన విద్యారుణాలు!
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 12:05 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో విద్యా రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2019–20లో విద్యారుణం తీసుకున్న వారి సంఖ్య 56 శాతం పడిపోయినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయడం విద్యారుణాలు తగ్గడానికి ప్రధానకారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. మొండి బకాయిలు పెరగడం కూడా కారణంగా చెబుతున్నారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. ఇప్పటివరకు విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఈ ఏడాది కూడా విద్యా రుణాలు దాదాపుగా ఉండకపోవచ్చని బ్యాంకర్లు తెలిపారు. ఇంజనీరింగ్‌ వంటి ఉన్నతవిద్యకు తీసుకునే రుణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తిరిగి అమల్లోకి రావడంతో విద్యారుణం తీసుకునే వారి సంఖ్య మరింత తగ్గిందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యారుణాలు మరింత తగ్గుతాయని బ్యాంకింగ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది ఈ సమయానికి రూ.కోటికిపైగా రుణాలు ఇచ్చామని, ఇప్పుడు అడిగే వారే కనిపించడం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!