పెద్ద మాటలు చెప్పి.. చిన్న చూపు చూశారు.. ‘ విద్య ‘ కేదీ సొమ్ములు ?

గత నాలుగేళ్లుగా తెలంగాణాలో కీలకమైన విద్యారంగం చతికిలబడిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన నివేదికలో తెలిపింది. ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని అభిప్రాయపడింది. ఈ రంగంకోసం బడ్జెట్ నిధులను ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేదని, బాలలకు గల నిర్బంధ విద్యా చట్టం (2009) అమలుకు నోచుకోలేదని, సర్వ శిక్షా అభియాన్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధుల్లో 50 శాతం కూడా వినియోగించుకోలేకపోయినట్టు ఈ రిపోర్టు పేర్కొంది. […]

పెద్ద మాటలు చెప్పి.. చిన్న చూపు చూశారు.. ' విద్య ' కేదీ సొమ్ములు ?
Follow us

|

Updated on: Sep 22, 2019 | 1:49 PM

గత నాలుగేళ్లుగా తెలంగాణాలో కీలకమైన విద్యారంగం చతికిలబడిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తన నివేదికలో తెలిపింది. ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని అభిప్రాయపడింది. ఈ రంగంకోసం బడ్జెట్ నిధులను ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేదని, బాలలకు గల నిర్బంధ విద్యా చట్టం (2009) అమలుకు నోచుకోలేదని, సర్వ శిక్షా అభియాన్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధుల్లో 50 శాతం కూడా వినియోగించుకోలేకపోయినట్టు ఈ రిపోర్టు పేర్కొంది. ప్రైమరీ స్కూలు నుంచి పీజీ స్థాయి (కేజీ టు పీజీ) వరకు విద్యార్థులకు ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని 2014 నాటి ఎన్నికల సందర్భంలోనే టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో హామీ ఇఛ్చిన విషయాన్ని కాగ్ నివేదిక గుర్తు చేసింది. అయితే ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని నివేదిక తెలిపింది. ‘ జనరల్, సోషల్ రంగాలపై పెట్టిన వ్యయంతో పోలిస్తే.. విద్యా రంగంపై పెట్టిన వ్యయాన్ని సర్కార్ మెల్లగా తగ్గిస్తూ వస్తోంది. 2014..15 లో ఈ రంగానికి పెట్టిన వ్యయం 16.56 శాతం కాగా.. ఇది 2015.. 16 నాటికి 13.8 శాతానికి, 2016.. 17 నాటికి 12.6 శాతానికి తగ్గింది ‘ అని ఈ రిపోర్టులో వెల్లడించారు. బాలల నిర్బంధ విద్యా చట్టం కింద తప్పనిసరిగా అమలు పరచాల్సిన ‘ చైల్డ్ మానిటరింగ్ సిస్టం ‘ ని కూడా తెరాస ప్రభుత్వం తేలేకపోయిందని, కానీ కర్నాటక, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇలా ఉండగా.. 2018 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కాగ్ నివేదికను ప్రభుత్వం ఆదివారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఇందులోని అంశాలను మంత్రి కేటీఆర్ సభకు వివరించారు. ‘ కేపిటల్ వ్యయంలో తెలంగాణ ముందంజలో ఉన్నప్పటికీ విద్యారంగంలో వెనుకబడి ఉందని ఈ నివేదిక పేర్కొంది.. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి మౌలిక సదుపాయాల కోసం సర్కార్ పెద్దపీట వేసింది. డిస్కం ల పునరుత్తేజం జరగాలంటే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి ‘ అని ఈ నివేదిక సూచించిందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటివరకు రూ. 70,758 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ రిపోర్టు వెల్లడించిందని ఆయన తెలిపారు.