ఇంగ్లండ్ – ఇండియా మ్యాచ్‌తో నిధుల సమీకరణ!

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఆదివారం నాటి ఇంగ్లండ్ – ఇండియా మ్యాచ్‌కో ప్రత్యేకత ఉంది. ఈ మ్యాచ్‌ ద్వారా బాలల క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ – యూనిసెఫ్ ఉమ్మడిగా నిధులు సేకరిస్తున్నాయి. ‘క్రికెట్ ఫర్ గుడ్’ అంటూ ‘పిల్లల కోసం ఒక రోజు’ను ఐసీసీ కేటాయించింది. దీనిలో భాగంగా ప్లేగ్రౌండ్ పండిట్లుగా ముగ్గురు పిల్లల్ని ఐసీసీ ఎంపిక చేసింది. ప్రేక్షకుల నుంచి విరాళాలను రాబట్టడమే వీరి పని. మ్యాచ్ మధ్యలో కామెంటేటర్లు, న్యూస్ ప్రెజెంటర్ల […]

ఇంగ్లండ్ - ఇండియా మ్యాచ్‌తో నిధుల సమీకరణ!
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2019 | 10:23 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఆదివారం నాటి ఇంగ్లండ్ – ఇండియా మ్యాచ్‌కో ప్రత్యేకత ఉంది. ఈ మ్యాచ్‌ ద్వారా బాలల క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ – యూనిసెఫ్ ఉమ్మడిగా నిధులు సేకరిస్తున్నాయి. ‘క్రికెట్ ఫర్ గుడ్’ అంటూ ‘పిల్లల కోసం ఒక రోజు’ను ఐసీసీ కేటాయించింది. దీనిలో భాగంగా ప్లేగ్రౌండ్ పండిట్లుగా ముగ్గురు పిల్లల్ని ఐసీసీ ఎంపిక చేసింది. ప్రేక్షకుల నుంచి విరాళాలను రాబట్టడమే వీరి పని. మ్యాచ్ మధ్యలో కామెంటేటర్లు, న్యూస్ ప్రెజెంటర్ల ద్వారా తమ లక్ష్యాన్ని చెప్పిస్తూ.. విరాళాలను సేకరిస్తారు. ఈ కార్యక్రమానికి ఉబర్ సంస్థ కూడా ముందుకొచ్చింది. ప్రతి ఫోర్‌కు 500 డాలర్లు, వికెట్‌కు 500 డాలర్లు చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో చిన్నారుల క్రీడల కోసం విరాళాలను ఉపయోగించనున్నారు.