మళ్లీ తెరపైకి రోజ్ వ్యాలీ స్కామ్.. బెంగాలీ హీరోకి ఈడీ నోటీసులు

Bengali Superstar Prosenjit, మళ్లీ తెరపైకి రోజ్ వ్యాలీ స్కామ్.. బెంగాలీ హీరోకి ఈడీ నోటీసులు

పశ్చిమబెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఈడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కాంలో ప్రముఖ నటుడు, బెంగాల్ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీకి సంబంధం ఉందంటూ.. మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. రోస్ వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010-2012లో పలు సినిమాలను నిర్మించారు. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ పేర్కొంది. దీనిపై జూలై 19లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ టాపిక్ బెంగాల్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బెంగాల్‌లో సంచలనంగా మారిన రోజ్‌వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేక రాజకీయ, సీనీ ప్రముఖులను పోలీసులు అరెస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు కూడా రోజ్‌వ్యాలీ కుంభకోణం పెద్ద దుమారాన్నే రేపింది.

శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న రాజీవ్ మార్కును సీబీఐ అరెస్టు చేసింది. బెంగాల్ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మోహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని.. రూ. 25 కోట్లు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *