అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు

అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు నమోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై కేసు నమోదు చేయాలంటూ గతంలో సీఐడీ ఈడీకి లేఖ రాసింది. అమరావతి కోర్ ఏరియాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు దాదాపు 720 ఎకరాల భూమిని అక్కడ భూములు […]

అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 03, 2020 | 4:45 PM

అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు నమోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై కేసు నమోదు చేయాలంటూ గతంలో సీఐడీ ఈడీకి లేఖ రాసింది. అమరావతి కోర్ ఏరియాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు దాదాపు 720 ఎకరాల భూమిని అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు పేరుతో రాజకీయ నాయకులు ఈ భూములు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఇక ఈ భూముల కొనుగోలులో మనీలాండరింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసిన సీఐడీ.. గతంలో ఈడీకి ఫిర్యాదు చేసింది.