ముసద్దీలాల్ జ్యువెల్లర్స్‌లో మరోసారి ఈడీ రైడ్స్

హైదరాబాద్‌ : ముసద్దీలాల్‌ జ్యువెల్లర్స్‌లో  ఈడీ మరోసారి సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో రూ.82 కోట్ల విలువైన 145 కిలోల బంగారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. యజమాని కైలాష్ గుప్త ఇల్లు, ఆఫీసుతో పాటు.. అతని నలుగురు సహచరుల ఇళ్లపై కూడా దాడులు చేపట్టారు. నోట్ల రద్దు సమయంలో… ముసద్దీలాల్‌ జువెలర్స్‌ రూ.110 కోట్ల బ్యాంక్‌ లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. ఐటీశాఖ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది. నోట్ల రద్దు రోజున 5,200 […]

ముసద్దీలాల్ జ్యువెల్లర్స్‌లో మరోసారి ఈడీ రైడ్స్
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2019 | 7:45 PM

హైదరాబాద్‌ : ముసద్దీలాల్‌ జ్యువెల్లర్స్‌లో  ఈడీ మరోసారి సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో రూ.82 కోట్ల విలువైన 145 కిలోల బంగారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. యజమాని కైలాష్ గుప్త ఇల్లు, ఆఫీసుతో పాటు.. అతని నలుగురు సహచరుల ఇళ్లపై కూడా దాడులు చేపట్టారు. నోట్ల రద్దు సమయంలో… ముసద్దీలాల్‌ జువెలర్స్‌ రూ.110 కోట్ల బ్యాంక్‌ లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. ఐటీశాఖ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది. నోట్ల రద్దు రోజున 5,200 మంది పేరుతో… ముసద్దీలాల్‌ జువెలర్స్‌ బోగస్ ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.