Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు మెడికల్‌ కాలేజీలో కరోనా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

వేల కోట్ల కుంభకోణం.. నట్టేట మునిగిన చెరుకు రైతులు

ED Raids BJP Ally RSP Leader Ratnakar Gutte in Multi-Crore Fraud in Maharashtra, వేల కోట్ల కుంభకోణం.. నట్టేట మునిగిన చెరుకు రైతులు

చెరుకు రైతులను మహారాష్ట్రలోని ఓ చక్కెర కర్మాగారం నట్టే ట ముంచేసింది. ఏకంగా రైతుల భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 5,400 కోట్ల రూపాయల రుణం తీసుకుని భారీ కుంభకోణానికి తెర లేపింది.
ఈ స్కామ్‌లో బీజేపీ మిత్రపక్షం ఆర్ఎప్పీ నేత రత్నాకర్ గుత్తేకు సంబంధం ఉండటం రాజకీయంగా సంచలనం రేపుతుంది.

మహారాష్ట్రలో గంగఖేడ్ షుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అనే చక్కెర కర్మాగారానికి రత్నాకర్ గుత్తే ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల చెరకు రైతుల నుంచి ఈ కంపెనీ పంట కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి 600 మంది రైతుల భూ వివరాలు సేకరించింది. రైతులకు తెలియకుండా వారి పంట, రవాణా పథకం కింద బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రుణం పొందింది. రూ.25 లక్షలు బకాయి ఉన్నారంటూ బ్యాంకుల నుంచి నోటీసులు అందడంతో రైతులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.

రైతుల తరపున ఎన్సీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. కాగా, పోలీసుల దర్యాప్తులో ఇది వేల కోట్ల కుంభకోణం అని బయటపడటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కంపెనీ నిర్వాహకులు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తూ.. కంపెనీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేపట్టింది. ముంబై, పర్బని, నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీ కార్యాలయాల్లో సోదాలు జరిపి పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related Tags