Big Story: సుశాంత్ కేసులో అన్నీ అనుమానాలే, వీడని మిస్టరీలే !

సుశాంత్ కేసులో మిస్టరీ వీడని కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తిని,, ఆమె ఛార్టర్డ్ అకౌంటెంటును ఈడీ సుదీర్ఘంగా..

Big Story: సుశాంత్ కేసులో అన్నీ అనుమానాలే, వీడని మిస్టరీలే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 10, 2020 | 6:22 PM

సుశాంత్ కేసులో మిస్టరీ వీడని కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తిని,, ఆమె ఛార్టర్డ్ అకౌంటెంటును ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. కానీ వారిద్దరూ ఇచ్చిన వాంగ్మూలాలు అస్సలు ఒకదానితో ఒకటి సరిపోలలేదని, పూర్తి వేర్వేరుగా ఉన్నాయని తెలిసింది. రియాతో కలిసి సుశాంత్ ప్రారంభించిన కంపెనీ ఐపీ చిరునామాలను 17 సార్లు మార్చినట్టు వెల్లడైంది. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 15 కోట్లు ఏమయ్యాయన్న అధికారుల ప్రశ్నకు రియా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదట..

రియాతో కలిసి సుశాంత్ ‘వివిధ్ రేజ్ రియాలిటీ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీని ఏర్పాటు చేశాడని, 2019 సెప్టెంబరులో బోర్డు పెట్టిన ఈ సంస్థకు రియా సోదరుడు షొవిక్ చక్రవర్తి డైరెక్టర్ గా వ్యవహరించాడని తెలిసింది. నవీ ముంబైలో రియా ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తికి చెందిన ఫ్లాట్ ని ఈ కంపెనీ అడ్రస్ గా ఇచ్చారని, కానీ ఏ కారణం వల్లో ఈ అడ్రసును 17 సార్లు మారుస్తూ వచ్చారని సమాచారం. అయితే ఇదే చిరునామాతో షోవిక్, సుశాంత్ ఇద్దరూ ఈ ఏడాది జనవరిలో ‘ఫ్రంట్ ఇండియా ఫర్ వరల్డ్ ఫౌండేషన్’ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారట. సుశాంత్ మృతికి కొన్ని రోజుల ముందే రియా చక్రవర్తి తాను డైరెక్టర్ గా ఉన్నవివిధ్ రేజ్ రియాలిటీ ఎక్స్ ప్రైవేట్ సంస్థలో ఈ పదవి నుంచి తప్పుకుందట.

అసలు ఈ కంపెనీలు ఎందుకు పెట్టారో, వీటి ధ్యేయమేమిటో, వీటి ద్వారా ఏయే లావాదేవీలు నిర్వహించారో తెలుసుకునే పనిలో పడ్డారు ఈడీ అధికారులు. చూడబోతే ఈ మిస్టరీ కేసు ఇప్పట్లో వీడేలా లేదు. మరోవైపు ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు రియా అంగీకరించినట్టు తెలుస్తోంది.