నీరవ్ మోదీకి బిగ్ షాక్.. రూ. 44.41 కోట్లు జప్తు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాకిచ్చింది. పీఎన్‌బీ మోసం చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన కుటుంబసభ్యులకు.. విదేశాల్లో వారికి చెందిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయాలంటూ ఈడీకి సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మోహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు జప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్‌ […]

నీరవ్ మోదీకి బిగ్ షాక్.. రూ. 44.41 కోట్లు జప్తు
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 10:18 AM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాకిచ్చింది. పీఎన్‌బీ మోసం చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన కుటుంబసభ్యులకు.. విదేశాల్లో వారికి చెందిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయాలంటూ ఈడీకి సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మోహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు జప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ. 44.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.

బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్‌డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్‌ మోదీకి స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు జప్తు చేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. గతేడాది జనవరిలో దొంగచాటున విదేశాలకు పారిపోయిన నీరవ్‌ని ఇటీవల లండన్‌లో అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?