భారత సంతతి ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీకి నోబెల్

ఆర్థిక‌శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ 2019 నోబెల్ ప్రైజ్‌ ముగ్గురికి లభించింది. అభిజిత్ బెన‌ర్జీ, ఈస్త‌ర్ డుఫ్లో, మైఖేల్ క్రీమ‌ర్‌ ఈ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేద‌రికాన్ని నిర్మూలించేందుకు ఈ ముగ్గురూ కలిసి అనేక పరిశోధనలు చేప‌ట్టార‌ని నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. వీరిలో అభిజిత్ బెనర్జీ భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. గడిచిన రెండు దశాబ్ధాల్లోనే ఈ ముగ్గురు ప్రతిపాదించిన ప‌రిశోధ‌నా సిద్ధాంతాలు ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ను మార్చేశాయ‌ని అభిప్రాయపడ్డారు. […]

భారత సంతతి ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీకి నోబెల్
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 14, 2019 | 5:05 PM

ఆర్థిక‌శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ 2019 నోబెల్ ప్రైజ్‌ ముగ్గురికి లభించింది. అభిజిత్ బెన‌ర్జీ, ఈస్త‌ర్ డుఫ్లో, మైఖేల్ క్రీమ‌ర్‌ ఈ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేద‌రికాన్ని నిర్మూలించేందుకు ఈ ముగ్గురూ కలిసి అనేక పరిశోధనలు చేప‌ట్టార‌ని నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. వీరిలో అభిజిత్ బెనర్జీ భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. గడిచిన రెండు దశాబ్ధాల్లోనే ఈ ముగ్గురు ప్రతిపాదించిన ప‌రిశోధ‌నా సిద్ధాంతాలు ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ను మార్చేశాయ‌ని అభిప్రాయపడ్డారు. ముగ్గురు ప్ర‌తిపాదించిన సిద్దాంతం.. చిన్న చిన్న ప్ర‌శ్న‌ల‌తో కీల‌క స‌మాచారాన్ని సేక‌రించే విధంగా చేసింద‌న్నారు.

పిల్ల‌ల ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ‌య్యేందుకు కావాల్సిన అనేక అంశాల‌ను వారి సిద్ధాంతంలో ప్ర‌తిపాదించిన‌ట్లు నోబెల్ క‌మిటీ చెప్పింది. వీరి కృషితో కెన్యా లాంటి ప్రాంతంలో పాఠ‌శాల ఫ‌లితాల అభివృద్ధిని మెరుగుప‌రిచింద‌న్నారు. భార‌త్ లాంటి దేశంలోనూ వీరు ప్రతిపాదించిన ఆర్థిక సూత్రాలు ఎంతో ఉప‌యోగకరంగా ఉన్నట్లు నిర్ధార‌ణ అయ్యిందని నోబెల్ క‌మిటీ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఈ ముగ్గురు చేసిన ప్ర‌తిపాదనలను విశేషంగా వినియోగిస్తున్న‌ట్లు క‌మిటీ స్పష్టం చేసింది. ఈ ముగ్గురు ఆర్థిక‌వేత్త‌ల ప్ర‌తిపాద‌న వ‌ల్ల సుమారు 50 ల‌క్ష‌ల మంది భార‌తీయ చిన్నారులు ల‌బ్ధి పొందిన‌ట్లు కూడా నోబెల్ క‌మిటీ స్పష్టం చేసింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..