Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

భలే ఐడియా..పెళ్లి కార్డుతో కాలుష్యానికి చెక్ !

New Way of Wedding Card, భలే ఐడియా..పెళ్లి కార్డుతో కాలుష్యానికి చెక్ !
పెళ్లికార్డులు అనగానే అందరూ వెరైటీ వెరైటీ కార్డులను ఎంచుకుంటున్నారు. ఒకరు వీడియో కార్డులతో ఆహ్వానిస్తే..మరికొందరు సంపన్నులు మాత్రం బంగారు, వెండితో తయారు చేయించిన ఆహ్వాన పత్రికలు కూడా  పంచుతారు. ప్రస్తుతం ఇప్పుడంతా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ల ట్రేడ్‌ నడుస్తోంది..అయితే, ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి వారంతా మామూలు పేపర్‌ కార్డులను వాడుతుంటారు. కానీ, సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఓ దంపతులు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు అందరనీ ఆకర్షిస్తోంది. తమ కూతురి వివాహ మహోత్సంలో ఓ అద్భుత కార్యక్రమాన్ని తలపెట్టారు. పర్యావరణ హితంగా ఉండేలా పెళ్లి కార్డులను తయారు చేయించారు. విజయ్‌ భాస్కర్‌, అరుణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, పెద్ద అమ్మాయి అవని. అవని వివాహ వేడుకలో వారు తయారు చేయించిన పెళ్లికార్డుల్లో పవిత్రమైన తులసీ విత్తనాలు పొందుపరిచారు. మరి కొన్నింటిలో కొన్ని రకాల పూల మొక్కల విత్తనాలతో తయారు చేయించారు. పెళ్లి తర్వాత ఆ కార్డులను వృద్ధాగా పారేయకుండా నీటిలో నానాబెటితే విత్తానలు మొలకెత్తుతాయని చెప్పారు. శుభకార్యం కోసం తయారు చేసిన వివాహ ఆహ్వాన పత్రికలు పర్యావరణ హితంగా ఉంటూ, నలుగురికి ఉపయోగపడలన్నదే తమ లక్ష్యం అని చెప్పారు విజయ్‌ భాస్కర్‌ దంపతులు. వారు నివసించే ఇంటిలో సైతం ఏ వస్తువు చూసినా పచ్చని ప్రకృతితో ముడివేసుకునే కనిపిస్తుంది. అవని పెళ్లి ఆహ్వానపత్రికలు చూసిన బంధువులు, స్థానికులు సైతం వారిని ఎంతగానో అభినందిస్తున్నారు.  మానవ మనుగడకు సవాల్‌గా మారిన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు గ్రీన్‌ చాలేంజ్‌ను స్వీకరించాలని ఆశిద్దాం..
New Way of Wedding Card, భలే ఐడియా..పెళ్లి కార్డుతో కాలుష్యానికి చెక్ !

Related Tags