సివిజిల్‌ యాప్‍తో ప్రశాంతంగా ఎన్నికలు

ఎన్నికల సమయంలో నిబంధనలకు ఎక్కడైనా విరుద్ధంగా కార్యకలాపాలు జరిగితే వాటిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకోనుంది. ఈ యాప్‌ ద్వారా ఎన్నికల్లో మద్యం, డబ్బులు, ఇతర వస్తువుల పంపిణీని అడ్డుకోవటంతో పాటు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. సివిజిల్‌ యాప్‌ను వినియోగించాలంటే అండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటే చాలు. దీనిని ప్లేస్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఎన్నికల సంఘం సూచించిన విధంగా చరవాణి వివరాలు, నంబర్లతో రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్టర్‌ చేసుకున్న […]

సివిజిల్‌ యాప్‍తో ప్రశాంతంగా ఎన్నికలు
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2019 | 5:33 PM

ఎన్నికల సమయంలో నిబంధనలకు ఎక్కడైనా విరుద్ధంగా కార్యకలాపాలు జరిగితే వాటిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకోనుంది. ఈ యాప్‌ ద్వారా ఎన్నికల్లో మద్యం, డబ్బులు, ఇతర వస్తువుల పంపిణీని అడ్డుకోవటంతో పాటు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది.

సివిజిల్‌ యాప్‌ను వినియోగించాలంటే అండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటే చాలు. దీనిని ప్లేస్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఎన్నికల సంఘం సూచించిన విధంగా చరవాణి వివరాలు, నంబర్లతో రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్టర్‌ చేసుకున్న నంబరుకు ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డు) వస్తుంది. దానిని ఎంటర్‌ చేస్తే వీడియోలు, ఫొటోలు తీసి పంపొచ్చు. అయితే పంపిన వారి వివరాలు ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంటాయి.

ఎన్నికల సంఘం రూపొందించిన ఈ యాప్‌లో వీడియో, చిత్రాలు, ఏం జరిగిందనే వివరాలను పంపాలి. వివరాలు పంపిన కొద్ది సమయానికే సమీపంలోని ఎన్నికల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటారు. వీడియోలు, ఫొటోలు పంపిన ప్రాంతం జీపీఎస్‌లో నమోదు అవుతుంది. తద్వారా యాప్‌లో అప్‌లోడ్‌ అయిన సమాచారం జీపీఎస్‌కు అనుగుణంగా జిల్లా అధికారులకు చేరుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారితో పాటు, ఇతర అధికారుల నంబర్లను యాప్‌కు అనుసంధానం చేశారు. అప్‌లోడ్‌ చేసిన కొద్ది సమయంలోనే అధికారులు వచ్చి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారని జేసీ హిమాన్షు శుక్లా తెలిపారు.