ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ బదిలీ
ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలిచ్చింది ఈసీ. ఆయన స్థానంలో సిద్ధార్థ్ కౌశల్‌ను నియమించింది. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ బదిలీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కోయ ప్రవీణ్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని.. ఈసీ నిబంధనలు పాటించే విషయంలోనూ పక్షపాతధోరణి ప్రదర్శిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. అయితే.. రేపు ఎన్నికల జరుగుతున్న తరుణంలో ఎస్పీని బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.