మహిళా ఓటర్లకు సానిటరీ ప్యాడ్స్.. ఈసీ వినూత్న నిర్ణయం

మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చే మహిళలకు సానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని ఈసీ భావిస్తోంది. ఈ నిర్ణయం దిశగా.. ఏప్రిల్ 29న జరిగే నాలుగో దశ ఎన్నికల్లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ‘‘ముంబయిలోని సఖి మత్దాన్ కేంద్రాలలో ఉన్న మహిళా ఓటర్లకు ఈ నెల 29న  సానిటరీ ప్యాడ్స్ ఇవ్వబోతున్నాం. పోలింగ్ బూత్‌కు వచ్చి మహిళలు తమ ఓటు […]

మహిళా ఓటర్లకు సానిటరీ ప్యాడ్స్.. ఈసీ వినూత్న నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 12:18 PM

మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చే మహిళలకు సానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని ఈసీ భావిస్తోంది. ఈ నిర్ణయం దిశగా.. ఏప్రిల్ 29న జరిగే నాలుగో దశ ఎన్నికల్లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ‘‘ముంబయిలోని సఖి మత్దాన్ కేంద్రాలలో ఉన్న మహిళా ఓటర్లకు ఈ నెల 29న  సానిటరీ ప్యాడ్స్ ఇవ్వబోతున్నాం. పోలింగ్ బూత్‌కు వచ్చి మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా ముంబయిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సఖి మత్దాన్ కేంద్రాలు ఉన్నాయి.