నూజివీడు సబ్ కలెక్టర్‌కు ఈసీ షోకాజ్ నోటీస్..

ఏపీ ఎన్నికల్లో అనేక చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చాలాచోట్ల ఈవీఎంల మొరాయింపు, ఆలస్యంగా పోలింగ్‌తో పాటు సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈవీఎంల భద్రత, రవాణా లోపాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నూజివీడు సబ్ కలెక్టర్ దినకర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అలాగే.. నూజీవీడు తహశీల్దార్ తేజేశ్వర్‌ రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. నూజివీడులో ఓ పోలింగ్ బూత్‌లో మాక్ పోలింగ్ ఓట్లు లెక్కించకుండా పోలింగ్ ప్రారంభించారు సిబ్బంది. 50 ఓట్లు […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:57 am, Wed, 17 April 19

ఏపీ ఎన్నికల్లో అనేక చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చాలాచోట్ల ఈవీఎంల మొరాయింపు, ఆలస్యంగా పోలింగ్‌తో పాటు సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈవీఎంల భద్రత, రవాణా లోపాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నూజివీడు సబ్ కలెక్టర్ దినకర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అలాగే.. నూజీవీడు తహశీల్దార్ తేజేశ్వర్‌ రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. నూజివీడులో ఓ పోలింగ్ బూత్‌లో మాక్ పోలింగ్ ఓట్లు లెక్కించకుండా పోలింగ్ ప్రారంభించారు సిబ్బంది. 50 ఓట్లు అదనంగా చూపించినా.. తేడా గమనించకుండా పోలింగ్ నిర్వహించారు. దీంతో.. పోలింగ్ సక్రమంగా జరిగిందా లేదా అనే దానిపై ఈసీ సీరియస్ అయింది.