ఈసీ కోడ్‌తో చంద్రబాబు గప్‌చుప్..

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న సమీక్షలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ.. కోడ్ అమలులో ఉన్న సమయంలో సమీక్షలు చేయడం, నియమావళిని ఉల్లంఘించడమే అంటున్నాయి ఈసీ వర్గాలు. కాగా.. ఎలక్షన్ కమిషన్ నియమావళికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో.. శాంతి భద్రతలపై నిర్వహించనున్న సమీక్షను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. దీనికి బదులు లా అండ్ ఆర్డర్‌పై హోం శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం బ్రీఫ్ చేశారు. నియమావళి […]

ఈసీ కోడ్‌తో చంద్రబాబు గప్‌చుప్..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 19, 2019 | 6:16 PM

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న సమీక్షలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ.. కోడ్ అమలులో ఉన్న సమయంలో సమీక్షలు చేయడం, నియమావళిని ఉల్లంఘించడమే అంటున్నాయి ఈసీ వర్గాలు. కాగా.. ఎలక్షన్ కమిషన్ నియమావళికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో.. శాంతి భద్రతలపై నిర్వహించనున్న సమీక్షను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. దీనికి బదులు లా అండ్ ఆర్డర్‌పై హోం శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం బ్రీఫ్ చేశారు. నియమావళి అమలులో ఉన్నందున సమీక్షలు నిర్వహించేకంటే బ్రీఫింగ్ చేయడం మేలని అధికారులకు సీఎం కూడా సూచించారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఎం, మంత్రులు కొన్నింటిపైనే సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల క్రిష్ణ ద్వివేది వెల్లడించారు. అలాగే.. వీడియో కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహించరాదని.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పరిస్థితిని సమీక్షించేందుకు, బాధితులకు సాయం చేసేందుకు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని స్ఫష్టం చేశారు. అది కూడా కొన్ని షరతులతో మాత్రమేనని అన్నారు ద్వివేది. వచ్చే నెల 27 వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటున్నందున ఈ విషయాలను గుర్తుంచు కోవాలని సూచించారు.

ఇక ఇదే విషయంపై ఎన్నికల కమిషన్‌ను కలిసింది వైసీపీ. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రికి, అధికారపార్టీకి కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు.