సరికొత్త ఫీచర్లతో ఓటర్ ఐడీ.. డూప్లికేట్ల దందాకు ఇక చెల్లు..!

ఓటర్ ఐడీ… ఒకప్పుడు కీలకమైన పనులన్నింటికీ ఈ కార్డునే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు అడ్రెస్ ప్రూఫ్ దగ్గర నుంచి.. ఫోటో ఐడీ వరకు ఆధార్ కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇకపోతే గతంలో ఓటర్ ఐడీ కార్డులు బ్లాక్ అండ్ వైట్‌లో ఉండగా.. వాటి స్థానంలో కలర్ ఐడీ కార్డులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ కలర్ ఓటర్ ఐడీ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు రానున్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఐడీ కార్డులను కేంద్ర ఎన్నికల సంఘం […]

సరికొత్త ఫీచర్లతో ఓటర్ ఐడీ.. డూప్లికేట్ల దందాకు ఇక చెల్లు..!
Follow us

|

Updated on: Dec 07, 2019 | 3:33 PM

ఓటర్ ఐడీ… ఒకప్పుడు కీలకమైన పనులన్నింటికీ ఈ కార్డునే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు అడ్రెస్ ప్రూఫ్ దగ్గర నుంచి.. ఫోటో ఐడీ వరకు ఆధార్ కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇకపోతే గతంలో ఓటర్ ఐడీ కార్డులు బ్లాక్ అండ్ వైట్‌లో ఉండగా.. వాటి స్థానంలో కలర్ ఐడీ కార్డులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ కలర్ ఓటర్ ఐడీ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు రానున్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఐడీ కార్డులను కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఓటర్లకు మంజూరు చేస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులకు అనేక ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఈసీ హోలోగ్రామ్ కలిగి ఉన్న ఈ స్మార్ట్ కార్డును ప్లాస్టిక్‌తో రూపొందించారు. అంతేకాకుండా ఈ కార్డు అనేక లేయర్లు కలిగి ఉంటుంది. దీంతో ఈ కార్డులను డూప్లికేట్ చేయడం చాలా కష్టం. ఇక ప్రతి కార్డుపై యూనిక్ బార్ కోడ్‌ ప్రింట్ అయ్యి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే.. సదరు ఓటర్ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. కాగా, ప్రస్తుతం 18 ఏళ్ళు నిండి.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఈ స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డులను ఇష్యు చేయనున్నారు. వారందరికీ ఈ కార్డులు వచ్చే ఏడాది జనవరి 25న అందనున్నాయి. అంతేకాక ఈ కార్డుల కోసం రూ.30లు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం కర్ణాటక ప్రజలకు ఈ కార్డులను మంజూరు చేస్తున్న ఈసీ.. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లందరికీ ఈ కార్డులు జారీ చేయనుంది. అటు బ్లాక్ అండ్ వైట్, కలర్ ఓటర్ ఐడీ కార్డులు ఉన్నవారు ఈసీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. 15 రోజుల్లో ఇంటికి కొత్త ఎపిక్ ఓటర్ ఐడీ వస్తుందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తెలిపారు.