సాధ్వి ప్రగ్యా సింగ్‌కు ఈసీ ఝలక్!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు సమస్యల్లో పడుతున్న భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు ఎలక్షన్ కమిషన్ బుధవారంనాడు షాక్ ఇచ్చింది. మూడు రోజుల పాటు ప్రచారం చేయకుండా ఆమెపై నిషేధం విధించింది. ఈ నిషేధం గురువారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు తాను గర్విస్తున్నానని సాధ్వి గత ఏప్రిల్ 21న వ్యాఖ్యలు చేశారు. మసీదు కూల్చివేతలో తాను భాగస్వామినని చెప్పుకున్నారు. అయోధ్యలో […]

సాధ్వి ప్రగ్యా సింగ్‌కు ఈసీ ఝలక్!
Follow us

| Edited By:

Updated on: May 01, 2019 | 9:24 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు సమస్యల్లో పడుతున్న భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు ఎలక్షన్ కమిషన్ బుధవారంనాడు షాక్ ఇచ్చింది. మూడు రోజుల పాటు ప్రచారం చేయకుండా ఆమెపై నిషేధం విధించింది. ఈ నిషేధం గురువారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుంది.

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు తాను గర్విస్తున్నానని సాధ్వి గత ఏప్రిల్ 21న వ్యాఖ్యలు చేశారు. మసీదు కూల్చివేతలో తాను భాగస్వామినని చెప్పుకున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంలో పాలుపంచుకుంటానని, అలా చేయకుండా తనను ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. సాధ్వి వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల సంఘం… మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ క్రమంలోనే బాబ్రీ మసీదు కూల్చివేతపై ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తాజాగా మూడు రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది.