మోదీకి క్లీన్‌చిట్.. ఎన్నికల సంఘం సభ్యుల్లో అసమ్మతి

Election Commissioner, మోదీకి క్లీన్‌చిట్.. ఎన్నికల సంఘం సభ్యుల్లో అసమ్మతి

కేంద్ర ఎన్నికల సంఘంలో అసమ్మతి రేగింది. ప్రధాని మోదీకి ఈసీ క్లీన్‌చిట్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా.. ఆ సంఘం నిర్వహిస్తోన్న సమావేశాలకు హాజరవ్వడం లేదు. ఈ విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు అశోక్ లేఖ రాశారు. అందులో కమిషన్‌లో మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం లేనప్పుడు ఫిర్యాదులపై కమిషన్ నిర్వహించే సమావేశాలు ఎందుకు హాజరవ్వాలని ప్రశ్నించారు.

ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్రమంలో మైనారిటీ అభిప్రాయాలను కూడా గౌరవించాలని.. చర్యలు తీసుకొని విషయంలో పారదర్శక పాటించాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు లావాసా లేఖపై స్పందించిన సీఈసీ అరోరా.. ఖ్యాసీ- జ్యుడిషియల్ మాదిరిగా మైనారిటీల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు.

కాగా ముగ్గురుగా ఉన్న ఈసీ కమిషనర్ల బృందంలో లావాసా ఒకరు. మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించాలరని ఇటీవల ఆరు ఫిర్యాదులు రాగా.. వాటిని మే 4న విచారించింది ఈసీ. ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే దీనిని లావాసా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *