Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

పియర్స్ పండ్లతో.. ఒబేసిటికి చెక్..!

Eating Pears Can Help Lower Blood Sugar Levels And Weight Loss, పియర్స్ పండ్లతో.. ఒబేసిటికి చెక్..!

యాపిల్ పండులాగే కనిపించే పియర్స్ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పియర్స్ పండ్ల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పియర్స్‌లో కాల్షియం, ఫొలేల్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ C, E, K ఉంటాయి. అలాగే బీటా-కెరోటిన్, ల్యూటెయిన్, ఖోలైన్, రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు.. రెగ్యులర్‌గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

మామూలుగా డయాబెటిక్స్ ఉన్న వారు అన్ని రకాల పండ్లూ తినకూడదు. కానీ… పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్‌, తక్కువ కేలరీలతో, ఎక్కువ ఫైబర్‌తో అందరూ తినేందుకు వీలవుతోంది. పైగా ఇందులో శరీరంలో విషవ్యర్థాల్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. డయాబెటిక్స్ ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. హై బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్‌కి తీసుకురాలేకపోతే, అవి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. రెగ్యులర్ ట్రీట్‌మెంట్, సరైన ఆహారం, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తుంటే, అధిక బరువు తగ్గడమే కాకుండా… షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. పియర్స్‌లో ఉండే ఫైబర్ వల్ల… మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి.. బాడీ వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పద్ధతిగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్‌ను ఈ పండ్లు తగ్గిస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే టేస్ట్ బాగున్నాయి కదా అని పియర్స్ మరీ ఎక్కువగా తిన్నా ప్రమాదమే. రోజుకు రెండు కంటే ఎక్కువ పండ్లను తింటే… కడుపులో గ్యాస్, పొట్ట ఉబ్బరం, నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.