జంక్ ఫుడ్ తింటే.. డిప్రెషన్ రోగం..!

పీజా, బర్గర్, చిప్స్ అంటూ అదేపనిగా జంక్ ఫుడ్ వెంట పడ్డామంటే.. ఒళ్ళు కొవ్వెక్కడం ఖాయం. ఈ మాట ఎప్పటినుంచో వింటూ వస్తున్నదే! శరీరంలో మోతాదుకు మించి ఫ్యాట్ పెరిగితే ఏర్పడే ముప్పు గురించి కూడా అందరికీ తెలుసు. కానీ.. జంక్ ఫుడ్ తినడమనే అలవాటు డిప్రెషన్ కి దారితీస్తుందన్నది తాజా బ్రేకింగ్..!

శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు.. రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరుతుందని, తద్వారా మానసికపరమైన సమస్యలు తలెత్తుతాయని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో సైంటిస్టులు తేల్చేశారు. మితిమీరిన బాడీ ఫ్యాట్.. నాడీ వ్యవస్థలోకి చెమ్మను చేర్చుతుందట. ఈ నీటి ఛాయలు మెదడులోని ఒక కీలక భాగం మీద ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామం.. మనలోని భావోద్వేగాల్ని నియంత్రించే hypothalamus అనే భాగాన్ని భ్రష్టు పట్టించి.. డిప్రెసివ్ సింప్టమ్స్ కి దారితీస్తుంది. ప్రస్తుతానికి క్లినికల్ ట్రయల్స్ ద్వారా వెల్లడైన ఈ అంశాల్ని.. తర్వాత రెగ్యులర్ రీసెర్చ్ లో ప్రవేశపెడతారు. తద్వారా ఫిజికల్ ఒబెసిటీకి, మెంటల్ డిప్రె షన్ కి వుండే సంబంధం ఏమిటన్నదానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. సో.. జంక్ ఫుడ్ అంటే పడిచచ్చేవాళ్ళు కాసేపు జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. లేకపోతే.. లేనిపోని మానసిక జబ్బులొచ్చి చిక్కుల్లో పడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *