వారానికి ఏడుసార్లే భోజనం.. డిన్నర్ మాత్రమే.. ట్విట్టర్‌ సీఈవో!

తన అసాధారణ ఆహార అలవాట్ల గురించి ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే వెల్లడించారు. వారంలో ఏడుసార్లు మాత్రమే భోజనం చేస్తున్నట్లు  అది కూడా రాత్రి డిన్నర్‌ మాత్రమే చేస్తానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన దైనందిన జీవితంలో విపాసన ధ్యానం క్రమం తప్పకుండా అనుసరించే డోర్సే, అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటానని చెప్పారు. ప్రతిరోజూ మంచు స్నానంతో కూడిన విచిత్రమైన జీవనశైలిని తన జాబితాలో చేర్చారు. డోర్సే తన ఆహారంలో చేపలు, చికెన్, ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకుంటారు. […]

వారానికి ఏడుసార్లే భోజనం.. డిన్నర్ మాత్రమే.. ట్విట్టర్‌ సీఈవో!
Follow us

| Edited By:

Updated on: Jan 16, 2020 | 6:33 PM

తన అసాధారణ ఆహార అలవాట్ల గురించి ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే వెల్లడించారు. వారంలో ఏడుసార్లు మాత్రమే భోజనం చేస్తున్నట్లు  అది కూడా రాత్రి డిన్నర్‌ మాత్రమే చేస్తానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన దైనందిన జీవితంలో విపాసన ధ్యానం క్రమం తప్పకుండా అనుసరించే డోర్సే, అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటానని చెప్పారు. ప్రతిరోజూ మంచు స్నానంతో కూడిన విచిత్రమైన జీవనశైలిని తన జాబితాలో చేర్చారు.

డోర్సే తన ఆహారంలో చేపలు, చికెన్, ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకుంటారు. బెర్రీలను డెజర్ట్ గా, డార్క్ చాక్లెట్ కూడా తీసుకుంటారు. రోజూ రెండు గంటలు ధ్యానం చేయడమే తన లక్ష్యమని డోర్సే చెప్పారు. తాను ప్రతి రోజు ఉత్సాహంగా పని చేస్తానని..ఈ నేపథ్యంలోనే మంచంపై ఒరిగిన పది నిముషాల్లోనే నిద్ర తనను పలకరిస్తుందని చెప్పుకొచ్చారు. డోర్సే కార్యాలయానికి ప్రతిరోజూ కాలినడకనే విటమిన్ సి తీసుకుంటూ వెళతారు. డోర్సే ఉదయం చల్లటి స్నానం తన మనస్సును “అన్‌లాక్” చేస్తుందని, ఏ సవాలునైనా సులభంగా అధిగమించవచ్చు అని తెలిపారు. సాయంత్రం మరోసారి మూడు నిమిషాల పాటు ఐస్‌ బాత్‌ చేసి సేద తీరుతానని చెప్పారు.