Terrace Garden Organic Food: టెర్రస్ గార్డెనింగ్ పై నగరవాసుల్లో పెరుగుతున్న ఆసక్తి సేంద్రీయ పద్ధతుల్లో మొక్కల పెంపకం కం

రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్న కొత్త వ్యాధులతో మనుషులకు ఆరోగ్యం పై.. తినే ఆహారం పై శ్రద్ధ పెరిగింది. అవును మనం తినే ఆహారం మన ఆయుస్సుని నిర్ణయిస్తుంది. ఆరోగ్యం సరిగ్గా లేక పొతే.. ఎంత డబ్బున్నా..

Terrace Garden Organic Food: టెర్రస్ గార్డెనింగ్ పై నగరవాసుల్లో పెరుగుతున్న ఆసక్తి సేంద్రీయ పద్ధతుల్లో మొక్కల పెంపకం కం
Follow us

|

Updated on: Jan 06, 2021 | 6:13 PM

Terrace Garden Organic Food: రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్న కొత్త వ్యాధులతో మనుషులకు ఆరోగ్యం పై.. తినే ఆహారం పై శ్రద్ధ పెరిగింది. అవును మనం తినే ఆహారం మన ఆయుస్సుని నిర్ణయిస్తుంది. ఆరోగ్యం సరిగ్గా లేక పొతే.. ఎంత డబ్బున్నా.. ఏమి లాభం అనే ఆలోచన ప్రస్తుత జనరేషన్ లో పెరిగింది. దీంతో మనం తీసుకునే ఆహారంలో అత్యాధికంగా రసాయనాలు ఉంటున్నాయని.. అవి విషతుల్యంగా పనిచేస్తూ అనేక వ్యాధి కారకాలుగా మారుతున్నాయనే అవగాహన అందరిలోనూ కలుగుతుంది. కొంత మంది అయితే ఒక్క అడుగు ముందుకేసి.. తన ఇంట్లోనే సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలను, ఆకుకూరలను పండించుకుంటున్నారు.

దీంతో ఇల్లే తాజా కూరగాయలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పట్టణాల్లో మొక్కలను పెంచుకోవడానికి స్థలం ఉండదు కనుక తమ టెర్రస్‌, బాల్కనీ లే వేదికగా నచ్చిన చోట ఇష్టమైన కూరగాయలు, ఆకుకూరలను పండించుకుంటున్నారు. ఇలా మొక్కలను పెంచడం ఆహ్లాదానికి ఆహ్లాదం.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ నగర వాసులు టెర్రస్‌ గార్డెన్‌పై అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. తమ గార్డెన్ లో పెంచే మొక్కలను రసాయనాలకు దూరంగా ఉంచుతూ.. సేంద్రీయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. తాజా తాజా కూరలతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు.

సేంద్రియ సాగుతోనే సంపూర్ణ ఆరోగ్యమంటూ నగర వాసులు మిద్దెలపై కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను పెంచుకునే విధానాన్ని మొదలు పెట్టారు. దీనినే రూఫ్‌ గార్డెన్‌ అంటారు. అయితే డాబాపై మొక్కల పెంపకంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు, అపార్ట్‌మెంట్‌ పై కప్పు బలంగా ఉన్నప్పుడే రూఫ్‌ గార్డెనింగ్‌కు ప్లాన్‌ చేయాలి. పై కప్పు కారకుండా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారుసేంద్రియ సాగుతోనే సంపూర్ణ ఆరోగ్యమంటూ నగర వాసులు మిద్దెలపై కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను పెంచుకునే విధానాన్ని మొదలు పెట్టారు. దీనినే రూఫ్‌ గార్డెన్‌ అంటారు. అయితే డాబాపై మొక్కల పెంపకంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు, అపార్ట్‌మెంట్‌ పై కప్పు బలంగా ఉన్నప్పుడే రూఫ్‌ గార్డెనింగ్‌కు ప్లాన్‌ చేయాలి. పై కప్పు కారకుండా ఉండాలి. ఇక సేంద్రియ సాగుకి ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వ తో పాటు మొక్కల పెంపంకం పై అవగాహన ఉన్నవారు సహకరిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలానికి అనుగుణంగా ఎటువంటి మొక్కలు పెంచుకోవాలి.. ఆ మొక్కలకు చీడపీడ బాధలు లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వంటి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

టెర్రస్ సాగు కోసం అవసమైన ట్రేలు, గ్రో బ్యాగ్స్‌, విత్తనాలు, ఎరువులు, మట్టి, వర్మి కంపోస్టును వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు అందిస్తున్నాయి. విత్తనం నాటే విధానం దగ్గర నుంచి ఆ మొక్కలు ఎదిగి… కాపు కసేవరకూ అవగాహన వినియోగదారులకు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ లో నాటిన మొక్కల పెరుగుదలకు మనం వాడేసిన వ్యర్థాలే ప్రధాన పెట్టుబడి. తెగుళ్లు, చీడపీడలు దరి చేరకుండా వేపనూనె, పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి. ట్రేలల్లోని మట్టిని సారవంతం చేసేందుకు ఆవు పేడ, గో మూత్రం, బెల్లంతో తయారు చేసిన జీవామృతాన్ని అందించాలి.సేంద్రియ సాగుకు పెద్ద ఖర్చు కాదు. వాడిన టీ పొడి, కోడిగుడ్లు పెంకులు, వేపాకుల ముద్దను ఎరువుగా వాడవచ్చు. ఇలా చేస్తే మొక్కలు ఏపుగా పెరిగి విరుగ కాస్తాయని సేంద్రీయ పద్దతిలో సాగు చేసేవారు చెబుతున్నారు.

రసాయనాలు వాడి పండించిన కూరగాయలు, పండ్లు తింటే అరోగ్యం పాడవడం ఖాయమని.. జన్యు సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు.. భారత్ లో పండే పంటలు ఇంగ్లాండ్‌, అమెరికా దేశాల కంటే విషతుల్యమని వివిధ పరిశోధనల్లో తేలింది. ఈ విషతుల్యం నుంచి బయటపడేందుకు సేంద్రియ సాగు ఒక్కటే మార్గమని అందరూ భావిస్తున్నారు. దీంతో మార్కెట్ లో ఆర్గానిక్ ఫుడ్ కు రోజు రోజుకీ డిమాండ్ పెరిగింది. రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్న కొత్తవైరస్ లు ప్రపంచ జనాభాపై ఏవిధంగా ప్రభావం చూపిందో మనం చూస్తూనే ఉన్నాం.. నిజానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే.. కరోనా వైరస్ పై మనదేశం బాగానే పోరాడింది అని చెప్పవచ్చు దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు.. మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని అని వైద్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కూడా చెప్పారు.

కనుక తాజాగా పరిస్థితుల్లో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కొన్ని ఏండ్లుగా మనకు తెలియకుండానే ఆహారంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అధిక దిగుబడుల కోసం పంటలపై విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన తర్వాత అవి పాడవకుండా నిల్వ చేయడానికి కూడా మందులు ఉపయోగిస్తున్నారు. వీటిని తిన్నప్పుడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆరోగ్యకరమైన, ఉల్లాసవంతమైన జీవితం గడపడానికి టెర్రస్‌ గార్డెన్‌ సరైన దారి. సేంద్రియ సాగుతో వందశాతం ఆరోగ్యంగా ఉండగలుగుతాం టెర్రస్‌ గార్డెన్‌పై పెంచే మొక్కలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం తాజా కూరగాయలతో పాటు సీజనల్ ఫ్రూట్స్ ను తప్పకుండా తీసుకోవాలి.. ఇవే వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయి.

9000 Years Old Toli Tirupati: ఎవరు చూస్తే వారి ఎత్తులోనే కనిపించే శ్రీవిష్ణు ఆలయం తొలి తిరుపతి ఎక్కడో తెలుసా?