కాలిఫోర్నియాలో మళ్లీ భూకంపం

కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రెండు దశాబ్ధాల తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో తీవ్రంగా భూమి కంపించింది. దీంతో దాదాపు 1400 మందికి పైగా ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. ఉత్తర్ లాస్ ఏంజిల్స్‌కు 240 కిలోమీటర్ల దూరంలో రిజ్డ్ క్రెస్ట్ వద్ద భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. తొలుత శుక్రవారం రిజ్ట్ క్రెస్ట్‌లో 5.4 తీవ్రతగా రికార్డైందని .. తర్వాత దాని తీవ్రత 7.1కు చేరిందని పేర్కొన్నారు. భూకంపం […]

కాలిఫోర్నియాలో మళ్లీ భూకంపం
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2019 | 8:37 PM

కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రెండు దశాబ్ధాల తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో తీవ్రంగా భూమి కంపించింది. దీంతో దాదాపు 1400 మందికి పైగా ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. ఉత్తర్ లాస్ ఏంజిల్స్‌కు 240 కిలోమీటర్ల దూరంలో రిజ్డ్ క్రెస్ట్ వద్ద భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. తొలుత శుక్రవారం రిజ్ట్ క్రెస్ట్‌లో 5.4 తీవ్రతగా రికార్డైందని .. తర్వాత దాని తీవ్రత 7.1కు చేరిందని పేర్కొన్నారు. భూకంపం కారణంగా భవనాలు కంపించాయని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు వాటిల్లాయని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల సంబంధమైన నష్టం అంతగా సంభవించలేదని లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. దక్షిణ కాలిఫోర్నియాలో గత రెండు దశాబ్దాల్లో ఇదే అతి పెద్ద భూకంపమని లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ తెలిపింది.