చైనాలో భారీ భూకంపం: 11 మంది మృతి, 122 మందికి గాయాలు

Earthquake in china, చైనాలో భారీ భూకంపం: 11 మంది మృతి, 122 మందికి గాయాలు

దక్షిణ చైనాలోని సిచువాన్​ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 6.0 తీవ్రత నమోదు అయ్యింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 300 మంది సహాయక సిబ్బంది రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు చైనా అధికారులు తెలిపారు. మూడు సార్లు సాధారణంగా కంపించిన భూమి మరో 41 నిమిషాల తర్వాత ఉగ్ర రూపం దాల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *