ఓ వైపు కరోనా.. మరోవైపు భూ ప్రకంపనలు.. ఎక్కడో కాదు మన భారత్‌లోనే..

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో ఉత్తర భారత ప్రజలను ఓ పిడుగులాంటి వార్త వణికిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం వరుసగా భూ ప్రకంపనలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు భూమి కంపించింది.రిక్టార్ స్కేల్‌పై 3.00 నుంచి 4.3 మధ్య ఈ ప్రకంపనలు వచ్చాయి. రాష్ట్రంలోని చంబా జిల్లాలో శుక్రవారం సాయంత్రం 5.11 గంటలకు తొలి ప్రకంపనం నమొదైంది. రిక్టార్ స్కేల్‌పై 3.6గా నమోదైంది. అయితే […]

ఓ వైపు కరోనా.. మరోవైపు భూ ప్రకంపనలు.. ఎక్కడో కాదు మన భారత్‌లోనే..
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 4:01 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో ఉత్తర భారత ప్రజలను ఓ పిడుగులాంటి వార్త వణికిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం వరుసగా భూ ప్రకంపనలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు భూమి కంపించింది.రిక్టార్ స్కేల్‌పై 3.00 నుంచి 4.3 మధ్య ఈ ప్రకంపనలు వచ్చాయి.

రాష్ట్రంలోని చంబా జిల్లాలో శుక్రవారం సాయంత్రం 5.11 గంటలకు తొలి ప్రకంపనం నమొదైంది. రిక్టార్ స్కేల్‌పై 3.6గా నమోదైంది. అయితే ఆ తర్వాత.. 5.17 నిమిషాలకు 4.3తో నమోదవ్వగా..5.45 గంటలకు 3.00గా నమోదైంది. తిరిగి సాయంత్రం 6.49 గంటలకు 3.8 తీవ్రతతో మరోసారి కంపించింది. తర్వాత రాత్రి 8.43 గంటలకు 3.4 తీవ్రతతో చివరి ప్రకంపనం వచ్చినట్లు.. సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదన్నారు. చంబా జిల్లాలో 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్న్ట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మరోవైపు దేశం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. ఈ భూ ప్రకంపనల వార్త హడలెత్తించింది.