1983లో భార‌త ఆట‌గాళ్ల పారితోషికం…?

భార‌త జాతీయ క్రికెట్ జ‌ట్టులో స్థానం సంపాదించుకుంటే ఇక తిరుగులేదు. క్రికెట్ పూర్తి క‌మ‌ర్షియ‌ల్ క్రీడ‌గా మారిపోయాక ఆట‌గాళ్ల సంపాద‌న‌ క‌ళ్లు చెదిరే రీతిలో ఉంటోంది. మ్యాచ్ ఫీజ్‌, ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్‌.. ఇలా ఒక్కో ఆట‌గాడు కోట్ల‌లో సంపాదిస్తున్నాడు. ఆట‌గాళ్ల‌ను వారి ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా ఎ+, ఎ, బి, సి కేట‌గిరీలుగా విడ‌దీసి బీసీసీఐ వారితో ఒప్పందం కుదుర్చుకుంటోంది. `ఎ+`లో స్థానం సంపాదించిన ఆట‌గాడి వార్షికాదాయం ఏడు కోట్లు. `ఎ`లో ఉంటే 5 కోట్లు, `బి`లో ఉంటే […]

1983లో భార‌త ఆట‌గాళ్ల పారితోషికం...?
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 4:17 PM

భార‌త జాతీయ క్రికెట్ జ‌ట్టులో స్థానం సంపాదించుకుంటే ఇక తిరుగులేదు. క్రికెట్ పూర్తి క‌మ‌ర్షియ‌ల్ క్రీడ‌గా మారిపోయాక ఆట‌గాళ్ల సంపాద‌న‌ క‌ళ్లు చెదిరే రీతిలో ఉంటోంది. మ్యాచ్ ఫీజ్‌, ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్‌.. ఇలా ఒక్కో ఆట‌గాడు కోట్ల‌లో సంపాదిస్తున్నాడు. ఆట‌గాళ్ల‌ను వారి ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా ఎ+, ఎ, బి, సి కేట‌గిరీలుగా విడ‌దీసి బీసీసీఐ వారితో ఒప్పందం కుదుర్చుకుంటోంది. `ఎ+`లో స్థానం సంపాదించిన ఆట‌గాడి వార్షికాదాయం ఏడు కోట్లు. `ఎ`లో ఉంటే 5 కోట్లు, `బి`లో ఉంటే 3 కోట్లు, `సి` అయితే కోటి రూపాయ‌ల చొప్పున సంవ‌త్స‌రానికి చెల్లిస్తోంది. మ్యాచ్ ఫీజ్ కాకుండా ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ ద్వారా వ‌చ్చే సంపాదన అదనం.

అయితే… 1983లో ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి భార‌త్‌లో క్రికెట్‌కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ తీసుకొచ్చిన క‌పిల్ జ‌ట్టు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? ప‌్ర‌స్తుత ఆట‌గాళ్ల సంపాద‌న‌తో పోల్చి చూసుకుంటే కొన్ని వేల రెట్లు త‌క్కువ‌. 1983 సెప్టెంబ‌ర్‌లో భార‌త్‌, పాక్ మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే ఎగ్జిబిష‌న్ మ్యాచ్ టీమ్ షీట్‌ను స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్ మ‌క్రంద్ బ‌య‌ట‌పెట్టారు. అప్ప‌ట్లో ఇలా వేర్వేరు విభాగాల్లో ఆట‌గాళ్ల‌ను చేర్చి మ్యాచ్ ఫీజు చెల్లించే ప‌ద్ధ‌తి లేదు.. మేనేజ‌ర్‌తో స‌హా ఆట‌గాళ్లంద‌రికీ ఒక‌టే ఫీజు. ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం త‌ర్వాత పాకిస్థాతో వన్డే మ్యాచ్ ఆడిన భార‌త ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రు మ్యాచ్ ఫీజుగా రూ.1500, డైలీ అల‌వెన్స్ కింద మూడ్రోజుల‌కు 600.. మొత్తం రూ.2100 అందుకున్నారు. ప్ర‌స్తుతం `సి` గ్రేడ్‌లో ఉన్న ఆట‌గాడు ఒక్క వ‌న్డే మ్యాచ్‌కు అందుకుంటున్న‌ది అక్ష‌రాలా ఆరు ల‌క్ష‌ల రూపాయ‌లు.