Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ల నిషేధం.. ఊదారంటే జైలే గతి !

Banning alternative smoking devices like e-cigarettes was one of the top priorities of the government., దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ల నిషేధం.. ఊదారంటే జైలే గతి !

ఎలెక్ట్రానిక్ (ఈ) సిగరెట్లపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటి ఉత్పత్తి, తయారీ, అమ్మకాలు, పంపిణీ లేదా యాడ్ లు ఇక శిక్షార్హ నేరాలని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు క్యాబినెట్ ఓ నిర్ణయాన్ని ఆమోదించిందని అన్నారు. ఇండియాలో ముఖ్యంగా యువత వీటికి అడిక్ట్ కావడం ఆందోళన కలిగిస్తోందని ఆమె చెప్పారు. ఈ-సిగరెట్ల నిషేధానికి సంబంధించిన ఆర్డినెన్సు ను అధ్యయనం చేసిన మంత్రుల బృందానికి నిర్మల ‘ సారథి ‘గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. వీటిని స్టోరేజీ చేసిన పక్షంలో ఆరు నెలల పాటు జైలుశిక్ష, లేదా 50 వేల జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. అలాగే వీటి ఉత్పత్తి, తయారీ, పంపిణీ, అమ్మకాలువంటివి చేస్తే మొదట ఏడాది పాటు జైలుశిక్ష, లేదా లక్ష రూపాయల ఫైన్, లేదా రెండూ విధిస్తారు. రెండో సారి పట్టుబడితే మూడేళ్ళ వరకు జైలు, 5 లక్షల జరిమానా విధిస్తారు.
ఈ-సిగరెట్లు పొగాకును మండించవు. కానీ హీటింగ్ ఎలిమెంట్లను వినియోగించినప్పుడు లిక్విడ్ నికోటిన్ ఆవిరిగా మారుతుంది. దీన్ని యూజర్ పీల్చడం హానికరం. ఇండియాలో వీటికి లైసెన్స్ లేదు. సిగరెట్ల కన్నా ఇవి హానికరం కానప్పటికీ స్మోకర్లు స్మోకింగ్ ను మానేసేందుకు వీటిని వాడుతారు.
దేశంలో 460 కి పైగా ఈ-సిగరెట్ బ్రాండ్లు లభ్యమవుతున్నాయట. 7,700 ఫ్లేవర్లతో ఈ బ్రాండ్లు మార్కెట్లలో దొరుకుతున్నాయి. కాగా-ఆర్డినెన్స్ జారీ కాగానే ఈ-సిగరెట్ల స్టాకులు కలిగిఉన్నవారు వెంటనే ఈ విషయాన్ని ప్రకటించి.. డిపాజిట్ స్టాక్స్ ని సమీప పోలీసు స్టేషన్లలో అప్పగించాల్సి ఉంటుంది. ఓ ఎస్ఐ ఈ స్టాక్స్ ను పరిశీలించి వీటిని స్వాధీనం చేసుకుంటారు. అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ-సిగరెట్లపై బ్యాన్ ఉంది. అటు-కేంద్రం వీటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించగానే సాధారణ సిగరెట్ల తయారీ కంపెనీల షేర్లు పెరగడం విశేషం.