లాక్​డౌన్​ను వ్యతిరేకిస్తూ నెదర్లాండ్స్​లో ఆందోళనలు.. కరోనా పరీక్ష కేంద్రాలకు నిప్పుపెట్టిన నిరసనకారులు

లాక్​డౌన్​ను వ్యతిరేకిస్తూ నెదర్లాండ్స్​లో ఆందోళనలు రాజుకుంటున్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. లాక్​డౌన్​ను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున

లాక్​డౌన్​ను వ్యతిరేకిస్తూ నెదర్లాండ్స్​లో ఆందోళనలు.. కరోనా పరీక్ష కేంద్రాలకు నిప్పుపెట్టిన నిరసనకారులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2021 | 9:40 AM

Lockdown Clashed : లాక్​డౌన్​ను వ్యతిరేకిస్తూ నెదర్లాండ్స్​లో ఆందోళనలు రాజుకుంటున్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. లాక్​డౌన్​ను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు కారణమైంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు పోలీసులు.

కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో విధించిన లాక్​డౌన్, కర్ఫ్యూలను నెదర్లాండ్స్​లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. రాజధాని అమెస్టర్​డామ్, దక్షిణ నగరమైన ఎయిధోవెన్​లలో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ఉర్క్ అనే మత్స్యకార గ్రామంలో శనివారం రాత్రి కర్ఫ్యూని వ్యతిరేకిస్తూ స్థానికులు తిరుగుబాటు చేశారు. సమీపంలోని హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన కరోనా వైరస్ పరీక్ష కేంద్రంలోకి కొందరు యువకులు చొరబడి నిప్పుపెట్టారు.

అమెస్టర్​డామ్​లో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. ఎయిధోవెన్​లో జల ఫిరంగులతో పాటు, బాష్పవాయువు కూడా ప్రయోగించారు. 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 3,600 మందికి ఆదివారం జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. లాక్​డౌన్​కు వ్యతిరేకంగా ఇంతకుముందు ఆదివారం కూడా ప్రజలు ఆందోళన చేపట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..