Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

పేరు బ్రాండ్.. పీస్ లోకల్!

Sony Duplicate TV Sales, పేరు బ్రాండ్.. పీస్ లోకల్!

బ్రాండెడ్ వస్తువులంటూ మీ ఇంటికి వస్తున్నారా! అయితే జాగ్రత్త అవి బ్రాండెడ్ కాకపోవచ్చు, డూప్లికేట్ అయి ఉండొచ్చు. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా వరంగల్ కేంద్రంగా సాగుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల దందా ఒకటి వెలుగు చూసింది. ఓ బ్రాండెడ్ కంపెనీ పేరుతొ యూపీకి చెందిన కొందరు వరంగల్ ను కేంద్రంగా చేసుకుని ఈ దందాలో అడ్డంగా బుక్కయ్యారు. ఏ వస్తువు కొనాలనుకున్నా బ్రాండెడ్ అయితే దాన్ని స్టేటస్ గా భావిస్తుంటారు. ఇప్పుడు బ్రాండెడ్ పేరుతొ బురిడీ కొట్టించే కేటుగాళ్లు తయారయ్యారు. అంతర్జాతీయ కంపెనీ సోని పేరుతో వరంగల్ కేంద్రంగా నకిలీవి అమ్ముతూ పట్టుబడ్డారు. కొంతమంది ఎలక్ట్రానిక్ షాపుల యజమానులతో కుమ్మక్కై ఈ దందా కొనసాగిస్తున్నారు.

ఈ విధంగా జనాలకు నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆసరాగా చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు. వీరి మాటలు విని టీవీ కొన్న ఓ వ్యక్తికి అది మూడు రోజుల్లోనే రిపేర్ కు వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా భాగోతం వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ దాడుల్లో 54 టీవీలు 120 హోమ్ థియేటర్లు 6 గురు ముఠా సభ్యులను స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ నకిలీ ల్యాప్ టాప్ లను, టీవీలను, హోమ్ థియేటర్లను ఒరిజినల్ వాటికంటే ముచ్చటగా ప్యాక్ చేస్తారు. వినియోగదారులు సులభంగా వీరి ట్రాప్ లో పడిపోతారు. వీరికి ఎక్కువగా డూప్లికేట్ పీసెస్ ఢిల్లీ నుండి సప్లై అవుతుంటాయి. అయితే వీరి వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.