Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

బర్త్ డే కేక్ కట్ చేసి..చిక్కుల్లో పడ్డ సినీ హీరో..!

Duniya Vijay Apologizes For Cutting Cake With Sword, బర్త్ డే కేక్ కట్ చేసి..చిక్కుల్లో పడ్డ సినీ హీరో..!

బర్త్ డే రోజు కేక్ కట్ చెయ్యడం కూడా తప్పా.. అవును తప్పే కేక్ కట్ చెయ్యడానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అంటున్నారు కొందరు నెటిజన్లు. అందుకు విరుద్దంగా ప్రవర్తించినందుకుగానూ కన్నడ హీరో దునియా విజయ్‌ను ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.  కర్ణాటక రాష్ట్రంలోని హోస్కెరికిహళ్లిలో దునియా విజయ్ తల్వార్‌తో కేక్ కట్ చెయ్యడం తీవ్ర వివాదానికి కారణమైంది. ​ ఈ ఆదివారం రాత్రి ఆయన తన 47వ బర్త్‌ డేను బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమా ‘సలగ’  టీజర్‌ను  కూడా రిలీజ్ చేశారు. అయితే కేక్‌ను నార్మల్ నైఫ్‌తో కాకుండా ఓ భారీ ఖడ్గంతో కట్ చేశాడు. ఇదే ఈ శాండిల్‌వుడ్ యాక్టర్‌ను చిక్కుల్లో పడేసింది.

మారణాయుధాలను ఓపెన్ ప్లేసుల్లో ప్రదర్శించడం చట్టరిత్యా నేరం. ఇదే పాయింట్‌ను హైలెట్ చేస్తూ, దునియా విజయ్‌ టార్గెట్‌గా ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా సెక్షన్ 283 ప్రకారం విజయ్‌పై యాక్షన్ తీసుకునేందుకు సదరు బర్త్ డే వీడియోను పరిశీలిస్తున్నారు. కత్తి పొడవు ఐదు అంగుళాల కంటే ఎక్కువ ఉంటే..వెపన్స్ యాక్ట్ కింద అతనిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Tags