Dulquer Salmaan: మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేపట్టనున్న బాలీవుడ్ దర్శకుడు.. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా..

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతుంది. ఇప్పటికే దుల్కర్ వైజ‌యంతీ

Dulquer Salmaan: మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేపట్టనున్న బాలీవుడ్ దర్శకుడు.. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా..
Follow us

|

Updated on: Jan 19, 2021 | 12:35 PM

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతుంది. ఇప్పటికే దుల్కర్ వైజ‌యంతీ మూవీస్ ఆధ్వర్యంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌. బాల్కీతో పాన్ ఇండియా మూవీకి స్టోరీ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు ఆర్‌. బాల్కీ.. చీనీకమ్, పా, షమితాబ్, కీ అండ్‌ కా, ప్యాడ్‌మ్యాన్‌’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా దుల్కర్ హీరోగా మరో థ్రిల్లర్ సినిమాను తీయడానికి సన్నద్ధమైనట్లు సమాచారం. ఇప్పటివరకూ బాల్కీ తీసిన సినిమాల కంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ను ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారని సమాచారం. ఒకే షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 2018లో వచ్చిన ‘కార్వాన్‌’తో హిందీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దుల్కర్‌. ఆ తర్వాత ‘జోయా ఫ్యాక్టర్‌’ అనే సినిమా కూడా చేశారు. ఇప్పడు ఈ సినిమా విజయం సాధిస్తే దుల్కర్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

‘సలార్’ వస్తున్నాడు… ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ కొత్త మూవీ..