’మహా‘ మంత్రికి కరోనా…కారణం అదేనట !

కరోనా సోకిన క్రమంలో తాను ఎంతగానో మానసిక ఆవేదనకు గురైనట్లుగా చెప్పారు.ఇక తాను బ్రతికే ఛాన్స్ లేదని భావించి తన ఆస్తి మొత్తం తన కూతురికే చెందేలా..ఐసియూలోనే వీలునామా రాయించినట్లుగా చెప్పారు.

’మహా‘ మంత్రికి కరోనా...కారణం అదేనట !
Follow us

|

Updated on: May 19, 2020 | 11:48 AM

ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది తప్పక ఉండాలి..కానీ, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఉంటే అది వారికే మంచిదని చెబుతుంటారు. అచ్చంగా అదే నిజమైందట ఓ మంత్రి విషయంలో..ఈ విషయాన్ని సదరు మంత్రిగారే స్వయంగా వెల్లడించారు తన ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే తను మహమ్మారి కరోనా వైరస్ బారినపడ్డానని చెప్పారు. అంతేకాదు, కరోనాతో పోరాటంలో చావు అంచులదాకా వెళ్లి వచ్చానని తెలిపారు. కోవిడ్ బారి నుంచి తను ఎలా కోలుకుని బయటపడ్డాడో..తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వివరించారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కేబినెట్‌లో కీలక మంత్రిగా కొనసాగుతున్న జితేంద్ర అహ్వద్ ఇటీవల కరోనా బారినపడ్డారు. మంత్రి అహ్వద్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ఓ అధికారికి ఏప్రిల్ 13న కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందుగానే అప్రమత్తమైన అహ్వద్ వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోగా..పాజిటివ్‌గా తేలటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారట. కరోనా సోకిన క్రమంలో తాను ఎంతగానో మానసిక ఆవేదనకు గురైనట్లుగా చెప్పారు. తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే తనకు కరోనా సోకిందని వివరించారు.

కరోనా నుంచి తాను కోలుకుంటానని, …బ్రతుకుతాననే నమ్మకం కూడా లేకుండా వైరస్‌తో పోరాటం చేశానని చెప్పారు. ఇక తాను బ్రతికే ఛాన్స్ లేదని భావించి తన ఆస్తి మొత్తం తన కూతురికే చెందేలా..ఐసియూలోనే వీలునామా రాయించినట్లుగా చెప్పారు. ఏప్రిల్ 23 నుంచి 26 వరకూ తన జీవితంలో అత్యంత కీలకమైన రోజులుగా తెలిపారు. తన జీవన శైలి, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కారణంగానే తాను వైరస్ బారినపడ్డానని చెప్పారు. చివరకు ఎలాగోలా వైరస్ నుంచి కోలుకుని బ్రతికి బయటపడ్డానని అన్నారు. ఇప్పుడు తన జీవన విధానం పూర్తిగా మారిపోయిందని, పూర్తి క్రమశిక్షణతో జీవిస్తున్నట్లు మంత్రి జితేంద్ర అహ్వద్ తెలిపారు