నాణ్యత లేని ఆయుధాలతో భారత ఆర్మీకి భారీ నష్టం

నాణ్యత లేని ఆయుధాల వినియోగం వల్ల 27 మంది సైనికుల ప్రాణాలతో పాటు రూ.960 కోట్ల నష్టం వాటిల్లిందని రక్షణశాఖ అంతర్గత నివేదికలో వెల్లడైంది.

నాణ్యత లేని ఆయుధాలతో భారత ఆర్మీకి భారీ నష్టం
Follow us

|

Updated on: Sep 30, 2020 | 7:29 PM

నాణ్యత లేని ఆయుధాల వినియోగం వల్ల 27 మంది సైనికుల ప్రాణాలతో పాటు రూ.960 కోట్ల నష్టం వాటిల్లిందని రక్షణశాఖ అంతర్గత నివేదికలో వెల్లడైంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఉత్పత్తి చేసిన ఆయుధాల్లో నాణ్యత సరిగా లేకపోవడం వల్ల 2014 నుండి 2019 మధ్య సైన్యం 27 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 146 మంది గాయపడ్డారు. జవాబుదారీతనం లేకపోవడం, లోపభూయిష్టమైన ఆయుధాల కొనుగోలు వల్ల రూ.960 కోట్ల నష్టం వాటిల్లిందని సైన్యం.. రక్షణశాఖకు సమర్పించిన అంతర్గత నివేదికలో వివరించింది.

2014 నుండి 2019 వరకు వారానికి సగటున ఒక ప్రమాదం చొప్పున జరిగిందని నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుండి 2019 మధ్య కాలంలో మొత్తం 403 సంఘటనలు జరిగాయి. దీనివల్ల సైన్యం 27 మరణాలు కోల్పోగా, 146 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఎవొబీలోని ఉత్పత్తులను షెల్ఫ్ జీవితాన్ని పూర్తి చేయకుండా పారవేశారని ఓ సైనికాధికారి తెలిపారు. షెల్ఫ్ లైఫ్‌లో సుమారు రూ. 658.58 కోట్ల విలువైన మందుగుండు సామగ్రిని ఏప్రిల్ 2014 మరియు 2019 ఏప్రిల్ మధ్య పారవేసినట్లు అధికారి తెలిపారు..

మే 2016 లో పుల్గావ్‌లోని సెంట్రల్ అమ్యునిషన్ డిపోలో ప్రమాదవశాత్తు గని పేలిన తరువాత రూ. 303.23 కోట్ల విలువైన గనులను పారవేసారు. ఈ సొమ్ముతో 100 శతఘ్నులను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ప్రభుత్వ అధీనంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ పనికి మాలిన ఆయుధాలను సరఫరా చేసినట్లు నివేదికలో తేలింది. లోపాలతో నిండిన ఆయుధాల్లో 125ఎంఎం ఎయిర్‌ డిఫెన్స్‌ షెల్స్‌, ఫిరంగి గుళ్లు, 125ఎంఎం ట్యాంక్‌ రౌండ్స్‌, వివిధ రకాల రైఫిళ్లలో వాడే బుల్లెట్లు ఉన్నాయి.

ఎఫ్ఓబీ ప్రతిపాదిత కార్పొరేటైజేషన్ కోసం డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ తో సమానంగా స్వయంప్రతిపత్తిని ఇస్తుంది. ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్యానెల్ 2024-25 నాటికి ఎఫ్ఓబీ టర్నోవర్‌ను రూ. 30,000 కోట్లకు పెంచడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోందని సైనికాధికారి పేర్కొన్నారు. రక్షణ శాఖ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతిపాదిత చర్యపై సైన్యం అనేక సిఫార్సులు చేసిందని వెల్లడించారు.