దుబ్బాకలో పొలిటికల్ హీట్ షురూ

ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. పార్టీ అభ్యర్థులను ఆయా అధిష్టానాలు ఖరారు చేయక ముందే, అన్ని పార్టీల నాయకులు జోరుగా ప్రచారం చేస్తు మాటల తూటాలు పేలుస్తున్నారు.

దుబ్బాకలో పొలిటికల్ హీట్ షురూ
Follow us

|

Updated on: Sep 18, 2020 | 5:06 PM

ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. పార్టీ అభ్యర్థులను ఆయా అధిష్టానాలు ఖరారు చేయక ముందే, అన్ని పార్టీల నాయకులు జోరుగా ప్రచారం చేస్తు మాటల తూటాలు పేలుస్తున్నారు. క్షణం తీరిక లేకుండా అన్ని గ్రామాలు కలియ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. ఇక, అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం దివంగత నేత రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తాం అని చాలా సార్లు స్పష్టం చేసింది. త్వరలోనే రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఖరారు చేస్తారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, బీజేపీ నుండి ఈసారి కూడా రఘునందన్ రావుకే టికెట్ ఇచ్చే అవకాశం కన్పిస్తుంది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికల పై అన్ని పార్టీలకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్స్ పార్టీకి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన మద్దెల నాగేశ్వర్ రెడ్డి పేరు వినబడినా.. అతనికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం రాజక్క పేట గ్రామానికి చెందిన వెంకట్ నర్సింహరెడ్డి, గతంలో మెదక్ ఎంపీగా పోటీ చేసిన శ్రవణ్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షుడు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.