Breaking News
  • వరద బాధితుల సహాయార్థం పెద్దఎత్తున సీఎంఆర్ఎఫ్ కి విరాళాలు: భారీ వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసులకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
  • తిరుమల: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తున్న మలయప్ప స్వామి. కరోనా దృష్ట్యా ఏకాంతంగా వాహన సేవలు.
  • ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు నమోదు, 16 మంది మృతి. ఏపీలో 7,96,919కు చేరిన కరోనా కేసులు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,524 మంది మృతి. యాక్టివ్‌ కేసులు 32,257, ఇప్పటి వరకు 7,58,138 మంది డిశ్చార్జ్. ఏపీలో ఇప్పటి వరకు 73,47,776 కరోనా పరీక్షల నిర్వహణ.
  • డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌పై సైబర్‌ ఎటాక్‌. డేటా చోరీ యత్నం జరిగినట్టు గుర్తించిన రెడ్డీస్ ల్యాబ్. ఐదు దేశాల్లో సంస్థ కార్యకలాపాలపై ప్రభావం. భారత్‌ సహా అమెరికా, లండన్‌, బ్రెజిల్‌, రష్యాలో నిలిచిన ఉత్పత్తులు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు. ఔషధ ప్రయోగశాలలను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు. స్పుత్నిక్‌-వి ట్రయల్స్ కోసం డాక్టర్‌ రెడ్డీస్‌తో రష్యా ఒప్పందం. సైబర్‌ ఎటాక్‌తో భారీ నష్టం వాటిల్లిందన్న రెడ్డీస్‌ ల్యాబ్. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డీస్‌ ల్యాబ్‌. 24 గంటల తర్వాత ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామన్న రెడ్డీస్‌ ల్యాబ్.
  • హైదరాబాద్‌: నేరేడ్‌మెట్‌ అంబేద్కర్‌నగర్‌లో విషాదం. కరోనాతో వెంకటేష్‌ అనే వ్యక్తి మృతి. భర్త మృతిని తట్టుకోలేక భార్య ధనలక్ష్మి ఆత్మహత్య. బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ధనలక్ష్మి.
  • విశాఖ చేరుకున్న అసోం రైఫిల్స్ జవాన్‌ బాబూరావు మృతదేహం. అసోం రైఫిల్స్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బాబూరావు. ఖోన్సా దగ్గర ఎదురుకాల్పుల్లో బాబూరావు మృతి. బాబూరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా దళాల నివాళులు. బాబూరావు భౌతికకాయం స్వస్థలానికి తరలింపు.
  • మహబూబాబాద్‌: హత్యకు గురైన దీక్షిత్‌ తల్లి ఆవేదన. నా కొడుకును హత్యచేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి. ఇలాంటి ఉన్మాదులను ఎన్‌కౌంటర్‌ చేయకపోతే.. ఏ తల్లీ ధైర్యంగా పిల్లలను బయటకు పంపే పరిస్థితి ఉండదు. పిల్లవాడని చూడకుండా కిరాతకంగా చంపినవారికి తగిన శిక్ష విధించాలి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తేనే నా కుమారుడి ఆత్మ శాంతిస్తుంది. -బాలుడు దీక్షిత్‌ తల్లి వసంత.

ఈ నెల 29న దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూలు.!

Dubbaka assembly constituency by poll notification likely to be announced, ఈ నెల 29న దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూలు.!

ఇటీవల చనిపోయిన టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక షెడ్యూలు ఈ నెల 29న వెలువడే అవకాశం ఉంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు శుక్రవారం వెలువడగా, దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూలును కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని భావించారు. అయితే పోలింగ్‌ సమయంపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ నెల 29న సమీక్ష నిర్వహించి ఉప ఎన్నిక షెడ్యూలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక షెడ్యూలుపై 29న స్పష్టత రానుంది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ స్థానంతో పాటు, మరో 64 శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక జరగాల్సి ఉంది.

దుబ్బాక ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే పార్టీ యంత్రాంగాన్ని మోహరించింది. పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడంతో పాటు, ఉపఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. మండల స్థాయిలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమించి గ్రామాల వారీగా పార్టీ కేడర్‌ను కూడగడుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్‌ కేటాయిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతుండగా, మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. షెడ్యూలు వెలువడిన తర్వాత పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనే యోచనలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉంది. అటు, నిజామాబాద్‌ శాసన మండలి స్థానిక సంస్థల కోటా స్థానానికి వచ్చేనెల 9న పోలింగ్‌ జరగనుండటంతో..పోలింగ్‌ నాటికి మరింత మంది ఓటర్ల బలం కూడగట్టుకుని భారీ ఆధిక్యం సాధించాలని టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

Related Tags