కరోనాతో పెళ్లిళ్లకు బ్రేకులు సరే.. మరి విడాకుల సంగతేంటి..?

కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి విషాదాన్ని మిగులుస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు దాదాపు 83వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 14 లక్షల మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు పలుదేశాలు లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలను బయటకి అనుమతిస్తున్నారు అధికారులు. ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కోర్టులు కూడా.. అత్యవసరమైన వాటి విషయంలోనే విచారణ చేపడుతున్నాయి తప్పా.. సాధారణ కేసులన్నింటి విషయంలో […]

కరోనాతో పెళ్లిళ్లకు బ్రేకులు సరే.. మరి విడాకుల సంగతేంటి..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2020 | 7:04 PM

కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి విషాదాన్ని మిగులుస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు దాదాపు 83వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 14 లక్షల మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు పలుదేశాలు లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలను బయటకి అనుమతిస్తున్నారు అధికారులు. ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసేలా అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కోర్టులు కూడా.. అత్యవసరమైన వాటి విషయంలోనే విచారణ చేపడుతున్నాయి తప్పా.. సాధారణ కేసులన్నింటి విషయంలో లాక్‌డౌన్‌ అనంతరమే విచారణ చేపట్టనున్నాయి.

ఇక పెళ్లిళ్లు తాజాగా దుబాయ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లతో పాటూ విడాకుల తీసుకోవాడాన్ని కూడా వాయిదా వేసింది. ప్రజలంతా ఒకేచోట గుమిగూడే అవకాశం ఉందన్న నేపథ్యంలో..ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్‌ న్యాయశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలకు దాటిపోగా.. 12 మంది మృతిచెందారు. లాక్‌డౌన్ కారణంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్లు మూతపడ్డాయి.