Breaking News
  • దేశవ్యాప్త కోవిడ్-19 గణాంకాలు: 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసులు: 93,337. దేశవ్యాప్త మొత్తం కేసుల సంఖ్య: 53,08,015. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్త మరణాలు: 1,247. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య: 85,619. 24 గంటల్లో డిశ్చార్జయినవారి సంఖ్య: 95,880. దేశవ్యాప్తంగా డిశ్చార్జయిన మొత్తం కేసులు: 42,08,431. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య: 10,13,964.
  • దేశంలో అల్-ఖైదా ఉగ్రవాదుల కుట్ర భగ్నం. కుట్రను భగ్నం చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కేరళ, బెంగాల్ సహా దేశవ్యాప్తంగా 11 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు. దాడుల్లో 9 మంది ఉగ్రవాదులు అరెస్ట్. బెంగాల్‌లో 6గురు, కేరళలో ముగ్గురు అరెస్ట్. మారణాయుధాలు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, జిహాదీ సాహిత్యం లభ్యం. ఇంట్లో తయారుచేయగలిగే బాంబులు, వాటికి సంబంధించిన సమాచారం స్వాధీనం. భారీగా ప్రాణనష్టం కల్గించే ఉగ్రవాద చర్యలకు కుట్ర. దేశ రాజధాని సహా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు జరపాలని పన్నాగం.
  • ఆరోగ్య శాఖ మంత్రి ఇ ఈటెల రాజేందర్ పేషీలో ఏడుగురికి సోకిన కరోనా. మంత్రి చుట్టూ ఉండే సిబ్బంది మొత్తానికి సోకిన వైరస్. ఇద్దరు పీఏ లు, ముగ్గురు గన్మెన్లు, ఇద్దరు డ్రైవర్లకు కరోనా. ప్రతి రెండు వారాలకు తన సిబ్బందికి టెస్టు చేయిస్తున్న మంత్రి. BRK భవన్ లో ఒక్కరోజే 13 మందికి పాజిటివ్.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: తెలంగాణ లో వేయి దాటినా కరోనా మరణాలు. తెలంగాణలో ఒకరోజు టెస్ట్ లో సంఖ్య 54459. తెలంగాణ లో కరోనా టెస్టింగ్స్ :2445409. రాష్ట్రంలో ఈరోజు పాజిటివ్ కేసులు : 2123. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 169169. జిహెచ్ఎంసి లో కరోనా కేసులు సంఖ్య : 305. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 56982. కరోనా తో ఈరోజు మరణాలు : 10. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 1025. చికిత్స పొందుతున్న కేసులు : 30636. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 2151. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 137508.
  • అమరావతి : టీడీపీకి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గుడ్ బై. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవనున్న వాసుపల్లి. మధ్యాహ్నం 12:30 కి సీఎం తో అపాయింట్మెంట్ . వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బాటలో వైసీపీ కి మద్దతు తెలిపే అవకాశం.
  • సుమేధ కేసులో పోలీసులకు అందిన పోస్టుమార్టం రిపోర్ట్: సైకిల్ పై తొక్కుతూ నాల లో పడిపోయిన సుమేధ. కింద పడిపోగానే తలకు బలమైన గాయం. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలో కి వెళ్ళింది. నాల లో పడి పోవడంతో నీళ్లు తాగింది. దీంతో శరీరంలో మొత్తం నీరు చేరి ఉబ్బిపోయింది. ఊపిరితిత్తులలోకి నీరు చేరడంతో శ్వాస ఆడక చనిపోయింది సుమేధ.

పోలీసు మద్దతుతో మందుబాబుల హల్‌చల్‌ !

Drunkers creating nonsense, పోలీసు మద్దతుతో మందుబాబుల హల్‌చల్‌ !
కర్నూలు జిల్లా నంద్యాలలో మందుబాబులు రెచ్చిపోయారు. పబ్లిక్‌గా మద్యం సేవిస్తూ..వచ్చేపోయే వారిని ఇబ్బందులకు గురిచేశారు. తప్పతాగి తప్పని చెప్పిన వారి పట్ల కూడా దారుణంగా ప్రవర్తించారు. వారికి సపోర్టుగా పోలీసు యూనిఫామ్‌లో ఉన్న మరో వ్యక్తి కూడా నానా హంగామా చేశాడు.
నంద్యాల పట్టణంలోని బాబుల్ రెడ్డి బిల్డింగ్ వద్ద కొందరు యువకులు మద్యం సేవిస్తూ హల్‌చల్‌ చేశారు. ఇంతలోనే స్థానికంగా నివాసముంటున్న ఇంతియాజ్‌ అనే వ్యక్తి అటుగా రావటంతో అతనితో గొడవకు దిగారు.
ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంతియాజ్‌ తండ్రి మస్తాన్‌వలి, అతని భార్య మరో కుమారుడిపై మందుబాబులు రెచ్చిపోయి ప్రవర్తించారు. రాళ్లతో దాడికి దిగారు. అయితే, జరిగిన ఘటనలో మందుబాబులకు తోడుగా నంద్యాల పోలీస్‌ సబ్‌డివిజన్‌కు సంబంధం లేని ఓ కానిస్టేబుల్‌ కూడా తాగుబోతులకు మద్దతుగా ప్రవర్తించాడు. గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది.. ఈ దాడిలో మస్తాన్‌వలి తలకు తీవ్ర గాయం కావడంతో అతన్ని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. వివాదానికి కారణమైన ఇద్దరు యువకులను టుటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కానిస్టేబుల్‌ వ్యవహారంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Tags