నడిరోడ్డుపై హంగామా సృష్టించిన తాగుబోతు

సికింద్రాబాద్‌లో ఓ తాగుబోతు నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. చనిపోతానంటూ బస్సుకింద పడబోయాడు. దీంతో కిలో మీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టుపక్కల వారు ఎంత సర్థిచెప్పినా వినకుండా అలాగే.. బస్సు ముందు నడిరోడ్డుపై కూర్చొని నానా హంగామా చేశాడు. చివరకు కొంతమంది స్థానికులు కలిసి తాగుబోతును కొట్టి రోడ్డు పక్కకు బలవంతంగా తీసుకొచ్చారు. తాగుబోతు అంతసేపు నడిరోడ్డుపై హంగామా చేస్తున్నా అక్కడకు పోలీసులు చేరుకోలేదు. దీంతో అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటరు మేర ట్రాఫిక్ […]

నడిరోడ్డుపై హంగామా సృష్టించిన తాగుబోతు
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 12:57 PM

సికింద్రాబాద్‌లో ఓ తాగుబోతు నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. చనిపోతానంటూ బస్సుకింద పడబోయాడు. దీంతో కిలో మీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టుపక్కల వారు ఎంత సర్థిచెప్పినా వినకుండా అలాగే.. బస్సు ముందు నడిరోడ్డుపై కూర్చొని నానా హంగామా చేశాడు. చివరకు కొంతమంది స్థానికులు కలిసి తాగుబోతును కొట్టి రోడ్డు పక్కకు బలవంతంగా తీసుకొచ్చారు. తాగుబోతు అంతసేపు నడిరోడ్డుపై హంగామా చేస్తున్నా అక్కడకు పోలీసులు చేరుకోలేదు. దీంతో అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.