కొత్త మోటార్ చట్టం.. తెలంగాణలో తొలి ఫైన్.. ఎలా పడిందంటే..!

Drunk biker in Nalgonda fined Rs 10000 under new MV Act, కొత్త మోటార్ చట్టం.. తెలంగాణలో తొలి ఫైన్.. ఎలా పడిందంటే..!

కేంద్రం సవరించిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలుపరచని విషయం తెలిసిందే.. అయినా కూడా ఓ వాహనదారుడికి ఈ చట్టం ప్రకారం ఫైన్ పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తికి రూ.10000/- పెనాల్టీ పడింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ.2000/- ఉండేది. అయితే 10000/- విధించడంతో కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ఫైన్ పడ్డట్లైంది. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్న నకిరేకల్‌కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని మంగళవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అయితే తొలి నేరంగా భావించిన న్యాయమూర్తి రూ.10000/- జరిమానా విధించారు. అయితే జరిమానా చెల్లించకపోతే.. 15 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *