డ్రంక్ అండ్ డ్రైవ్ సీన్ షూటింగ్..రియల్ పోలీసులు అనుకోని లగెత్తిన మందుబాబులు

actors drunk and drive creates tension for alcoholic riders, డ్రంక్ అండ్ డ్రైవ్ సీన్ షూటింగ్..రియల్ పోలీసులు అనుకోని లగెత్తిన మందుబాబులు

ఫిలిం నగర్, జూబ్లిహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్స్‌లో రెగ్యులర్‌గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తూ..తాగి వాహనాలు నడిపే మందుబాబుల తాట తీస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో వాహనాలతో వెళ్లాలంటే.. తాగినవారు జడుసుకుంటున్నారు. శనివారం కూడా షేక్ పేట ప్రాంతంలో ట్రాపిక్ పోలీసులను చూసి..వారి చేతుల్లో ఉన్న బ్రీత్ ఎనలైజర్లు కనపడగానే.. మందుబాబులు యదావిధిగా బైక్‌లు వెనక్కి తిప్పుకుని పారిపోయారు. అడ్డదిడ్డంగా అక్కడినుంచి తప్పించుకుపోయే ప్రయత్నం చేశారు.

ఇదంతా చూసి అక్కడ ఉన్న పోలీసులు నవ్వుకున్నారు. ఎందుకంటే వాళ్లు రియల్ కాప్స్ కారు..సినిమా షూటింగ్ కోసం వచ్చిన రీల్ పోలీసులు. ఓ సినిమాలో డ్రంక్ డ్రైవ్ సీన్ షూట్ చెయ్యడం కోసం వారు ఆ లోకేషన్‌ను ఎంచుకున్నారు. వారు తమను ఎందుకు ఫాలో అవ్వడం లేదని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే బ్యాచ్ క్రాస్ చెక్ చేస్కోగా..షూటింగ్ అని తెలుసుకోని కంగుతిన్నారు. తమలో తాము నవ్వుకున్నారు. తాగి వాహనాలు డ్రైవ్ చెయ్యడం ఎందుకు..అంతలా కంగారు పడటం ఎందుకు?. ఇకనైనా మారండి బాస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *