Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

దుబాయ్‌లో స్మగ్లర్ కొత్త ఎత్తుగడ..కండోమ్స్‌లో కొకైన్

Drug smuggler hid 2 kilograms of cocaine in 80 condoms, దుబాయ్‌లో స్మగ్లర్ కొత్త ఎత్తుగడ..కండోమ్స్‌లో కొకైన్

పెరూ దేశానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… పెరూ నుంచి ఈజిప్టుకు వెళుతున్న నిందితుడు ఫ్లైట్ మార్పిడిలో భాగంగా దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగాడు. అయితే అతని బ్యాగేజీని పరిశీలించగా పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్స్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే ఇన్ని కండోమ్ ప్యాకెట్స్ బ్యాగేజ్‌లో ఎందుకున్నాయనే అనుమానంతో వాటిని విప్పి చూశారు. ఇంకేముందు ఆ కండోమ్స్‌లో తెల్లటి పొడి పదార్థం బయటపడింది. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అలర్ట్ అయి… నార్కోటిక్స్ టీమ్‌కు తెలియజేయగా ఆ తెల్లటి పొడి పదార్థం కొకైన్ అని తేల్చారు. నిందితుడి బ్యాగు నుంచి వెలికి తీసిన 80 కండోమ్స్‌లో ఏకంగా 2.3 కేజీల కొకైన్ బయట పడగా మొత్తం సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అయితే ఇటీవలి కాలంలో దుబాయ్ కేంద్రంగా డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యంగా బంగారం, డ్రగ్స్, వజ్రాలు, ఆయుధాలను పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తుండటంతో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీంతో అలర్టైన యూఎఈ అధికారులు ఎలాగైన స్మగ్లింగ్ ముఠాల ఆగడాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, కఠినమైన చట్టాలతో శిక్షలు కూడా వేస్తున్నారు. అయితే ఎన్ని చేసినప్పటికీ స్మగ్లర్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులు వెతుకుతుండటం గమనార్హం.