బెజ‌వాడ‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..కీల‌క విష‌యాలు వెలుగులోకి..

బెజవాడలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపాయి. ఈ ఇష్యూపై పోలీసులు ఫోక‌స్ పెట్ట‌గా..కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇప్ప‌టికే ఈ కేసులో ఇద్ద‌రు విదేశీయుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

బెజ‌వాడ‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..కీల‌క విష‌యాలు వెలుగులోకి..
Follow us

|

Updated on: Jul 16, 2020 | 12:15 PM

బెజవాడలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపాయి. ఈ ఇష్యూపై పోలీసులు ఫోక‌స్ పెట్ట‌గా..కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇప్ప‌టికే ఈ కేసులో ఇద్ద‌రు విదేశీయుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలా డ్ర‌గ్స్ కేసులో న‌గ‌రంలో ఫారెనర్స్ అరెస్టవ్వ‌డం ఇది రెండోసారి. గతంలో సీపీగా ద్వారక తిరుమల రావు ఉన్న‌ సమయంలో కూడా డ్ర‌గ్స్ కేసులో ఇద్దరు విదేశీయులు అరెస్ట‌య్యారు. కాగా బెజవాడలో యువతకు డ్రగ్స్ అమ్మకంలో ‌ కోనేరు అర్జున్ అనే వ్య‌క్తి కీలక పాత్ర పోషిస్తోన్నట్లు పోలీసులు గుర్తించారు. సూడాన్ కి చెందిన రసూల్, టాన్జానియాకి చెందిన యోనాల‌ నుంచి డ్రగ్స్ కొని.. అత‌డు కాలేజీ విద్యార్థులకు విక్ర‌యాలు చేస్తున్న‌ట్టు నిర్దారించారు. పెనమలూరు పీఎస్ పరిధిలో ఒక కళాశాలలో అర్జున్ బీటెక్ చేశాడు.

చ‌దువుకున్న‌ప్ప‌టి పరిచయాలు, ఇతర కళాశాలల్లో విద్యార్థుల సాన్నిహిత్యంతో అర్జున్ డ్రగ్స్ అమ్మకాలు చేప‌ట్టిన‌ట్టు పోలీసులు గుర్తించారు. అర్జున్ దగ్గర డ్రగ్స్ కొన్న‌వారిని విచారించే ఆలోచనలో ఉన్నారు బెజవాడ పోలీసులు. విదేశీయుల పాస్ పోర్టు సీజ్ చేయటానికి చర్యలు ప్రారంభించారు.