ఒక్క సెల్‌ఫోన్ తో.. 8 మంది డ్రగ్ బానిసలు పట్టివేత..!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డ్రగ్స్ వ్యాపారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్.. ఎనిమిది మంది డ్రగ్ బానిసలను

ఒక్క సెల్‌ఫోన్ తో.. 8 మంది డ్రగ్ బానిసలు పట్టివేత..!
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 7:15 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డ్రగ్స్ వ్యాపారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్.. ఎనిమిది మంది డ్రగ్ బానిసలను పట్టించింది. బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈశ్వర్ యెల్చూర్ అనే 24 వ్యక్తి వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో గంజాయి అమ్ముతుండగా గత నెల 22న పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 245 గ్రాముల డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు.. రెండు రోజుల తరువాత, యెల్చూర్ సన్నిహితుడు గోపీ కృష్ణ (40) అనే వ్యక్తి కూడా పట్టుబడ్డాడు. ‘‘గోపీ కస్టమర్లు అతడికి ఫోన్ చేస్తుండడంతో.. నిషేధిత డ్రగ్స్ తీసుకునేందుకు వారిని జయానగర్ మెట్రో స్టేషన్ వద్దకు రావాలని గోపీతో చెప్పించాం. సోమ, మంగళవారాల్లో డ్రగ్స్ కోసం అతడికి ఫోన్ చేసిన ఎనిమిది మందిని అరెస్టు చేశాం. ఈ వ్యవహారంపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాం..’’ అని ఓ అధికారి వెల్లడించారు. పట్టుబడిన వారంతా పలు ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.