కరోనా ఎఫెక్ట్.. ముంబైలోని ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా..

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే ప్రస్తుం ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలో ముస్లింలంతా ఇంటిలోనే ప్రార్ధనలు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఇందుకు ముస్లిం మత పెద్దలు కూడా అంతా ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చిరస్తున్నారు. దీనిపై […]

కరోనా ఎఫెక్ట్.. ముంబైలోని ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా..
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 1:04 PM

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే ప్రస్తుం ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలో ముస్లింలంతా ఇంటిలోనే ప్రార్ధనలు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఇందుకు ముస్లిం మత పెద్దలు కూడా అంతా ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చిరస్తున్నారు. దీనిపై నిఘా పెట్టేందుకు మహారాష్ట్ర సర్కార్.. డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టేందుకు రెడీ అయ్యింది. ముంబై నగరంలోని ఎక్కువగా ముస్లింలు ఉండే ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ కొనసాగుతున్నందున సహర్, ఇఫ్తార్‌ల సందర్భంగా ముస్లింములకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వమని ముంబై పోలీసు అధికార ప్రతినిధి ప్రణయ్ అశోక్ చెప్పారు.

రంజాన్ మాసం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మసీదులు, భవనాలు, బిల్డింగ్ పై భాగంలో జనం గుమిగూడకుండా డ్రోన్లతో నిఘా వేసినట్లు తెలిపారు. ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని.. నిరంతరాయంగా కరెంట్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు.