అక్రమ నిర్మాణాలకు ‘డ్రోన్ల’తో చెక్

అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి నిర్మూలనకు మూసీ నది అభివృద్ధి సంస్థ(ఎమ్ఆర్డీసీ) చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు వారు డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ల ద్వారా మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమనిర్మాణాలను గుర్తించి.. వాటికి సంబంధించిన ఫొటోలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులకు పంపనున్నామని వారు తెలిపారు. ఆ తరువాత […]

అక్రమ నిర్మాణాలకు ‘డ్రోన్ల’తో చెక్
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 1:08 PM

అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి నిర్మూలనకు మూసీ నది అభివృద్ధి సంస్థ(ఎమ్ఆర్డీసీ) చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు వారు డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ల ద్వారా మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమనిర్మాణాలను గుర్తించి.. వాటికి సంబంధించిన ఫొటోలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులకు పంపనున్నామని వారు తెలిపారు. ఆ తరువాత రెవెన్యూ శాఖ సహకారంతో వాటిని తొలగించనున్నామని ఎమ్ఆర్డీసీ అధికారులు పేర్కొన్నారు.

అయితే 2016 రెవెన్యూ శాఖ జరిపిన ఓ సర్వేలో మూసీ నది పరివాహక మండలాల్లో 8,529 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. వీటిపై సమగ్ర వివరాలను సేకరించిన అధికారులు అప్పట్లో కొన్నింటిని తొలగించారు. అయినా ఇప్పటికీ కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాల నిర్మాణం జరుగుతుందని తెలిపిన అధికారులు.. వాటిని నిర్మూలించేందుకు తాము చర్యలు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. కాగా వీటితో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాని ఎమ్ఆర్డీసీకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!